కడుపునొప్పితో ఆస్పత్రికి పదేళ్ల బాలిక.. సర్జరీ చేసి చూస్తే షాక్
మహారాష్ట్రలోని అమరావతిలో డాక్టర్లు సైతం షాకయ్యే ఒక కేసు వెలుగులోకి వచ్చింది. జీర్ణ సమస్యలంటూ ఒక పదేళ్ల బాలికను ఆమె కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చించారు. అన్ని వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులోని అర కిలో వెంట్రుకలను తొలగించారు. బాలిక కడుపులో వెంట్రుకలన్నీ గట్టి బంతిలా పేరుకుపోయాయని వైద్యులు తెలిపారు.
ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జులై 29, మంగళవారం పీడియాట్రిక్ సర్జన్ డా. ఉషా బాలికకు సర్జరీ చేశారు. 20 రోజుల క్రితం.. ఐదారు నెలలుగా ఆకలి లేకపోవటం, వాంతుల సమస్యతో కుటుంబ సభ్యులు బాలికను తమ వద్దకు తీసుకొచ్చారని డాక్టర్ తెలిపారు. కొంతకాలంగా బాలిక బరువు తగ్గుతూ వచ్చిందని డా. ఉష తెలిపారు. అయితే, కౌన్సిలింగ్ సమయంలో.. తనకు చాలా కాలంగా జుట్టు తినే అలవాటుందని ఆ బాలిక చెప్పిందని కూడా డాక్టర్ వెల్లడించారు. ఆమె కడుపులో బంతిలాగా వెంట్రుకలు పేరుకుపోయాయని వైద్య పరీక్షలో గుర్తించామని, ఈ క్రమంలోనే సర్జరీ చేసి వాటిని తొలగించామని డా. ఉష వెల్లడించారు. ఇప్పుడు ఆ బాలిక సరిగ్గా తినగలుగుతోందని, ఆమెకు వేరే ఎలాంటి సమస్య లేదని, త్వరలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తారని వైద్యులు చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మబాబోయ్.. చెట్టుకి దెయ్యం పట్టిందా.. ఏం జరిగిందో చూస్తే..!