సముద్ర తీరంలో భారీ కళేబరం.. దగ్గరికెళ్లి చూస్తే

Updated on: Oct 23, 2025 | 4:39 PM

సముద్ర తీరానికి ఓ భారీ కళేబరం కొట్టుకొచ్చింది. దాదాపు 100 అడుగుల పొడవున్న ఆ కళేబరాన్ని చూసి స్థానికులు, సందర్శకులు ఆశ్చర్యపోయారు. అది ఏమై ఉంటుంది.. అది ప్రాణాలతో ఉందా లేక ఏదైనా సముద్ర జీవి మృతదేహమా అనేది అర్థం కాకపోవటంతో.. ముందుగా మత్స్యకారులు కాస్త గందరగోళపడ్డారు. అయితే దగ్గరకు వెళ్లి చూసిన మత్స్యకారులు దానిని తిమింగలంగా గుర్తించారు.

అది బతికి ఉందేమోనని భావించి.. అందరూ కలిసి దానిని తిరిగి సముద్రంలోకి తోసేందుకు ప్రయత్నించారు. అయితే..ఇంత గందరగోళంలోనూ తిమింగలంలో ఏ స్పందనా లేకపోవటంతో అది మృతి చెందిందని నిర్ధారించుకున్నారు. కాగా, ఈ భారీ తిమింగలం వార్త తెలిసిన సమీప ప్రాంతాల వారంతా.. దానిని చూసేందుకు అక్కడికి తరలిరావటంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం తీనార్ల సముద్ర తీరానికి ఈ 100 అడుగలు పొడవైన భారీ తిమింగలం కళేబరం కొట్టుకొచ్చింది. అటుగా వెళుతున్న మత్స్యకారులు.. సముద్రంలోనుంచి ఏదో పెద్ద జీవి కొట్టుకొస్తున్నట్టు గుర్తించారు. తీరా దగ్గరకు వెళ్లి చూసాక.. అది తిమింగలం అని తెలుసుకుని అవాక్కయ్యారు. సమాచారం అందుకున్న మత్స్యశాఖ అధికారులు తీరానికి చేరుకొని చేపను పరిశీలించారు. సముద్రంలో ఏదైనా భారీ నౌక ఢీకొని మృతి చెంది ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇంత భారీ కాయంతో ఉన్న చేపను ఎప్పుడూ చూడలేదని అంటున్నారు స్థానికులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాట్సాప్‌ కీలక అప్‌డేట్‌… ఇకపై చాట్ జీపీటీ పని చేయదు

రాబోయేది మినరల్ వార్.. రంగంలోకి భారత్‌.. చైనాకు చెక్‌

గత అమావాస్యకు క్షుద్రపూజలు.. ఈ అమావాస్యకు షాపు దగ్ధం

అదరహో.. విమానాన్ని తలదన్నేలా వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌

గూగుల్‌ ఆఫీసులో నల్లుల బెడద