మత్స్యకారుల పంట పండింది.. వలకు చిక్కిన 340 కిలోల చేప
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని హుగ్లీ నదిలో వేటకు వెళ్లిన మత్స్యకారులను అదృష్టం వరించింది. మాహిష్మరి ప్రాంతానికి చెందిన వారి వలలో 340 కిలోల భారీ చేప పడింది.
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని హుగ్లీ నదిలో వేటకు వెళ్లిన మత్స్యకారులను అదృష్టం వరించింది. మాహిష్మరి ప్రాంతానికి చెందిన వారి వలలో 340 కిలోల భారీ చేప పడింది. దీంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. గంగసాగర్‌లోని మహిష్మరి ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు గురుపాద్.. హుగ్లీ నదిలో చేపల వేటకు వెళ్లాడు. వల విసరగానే జాలరిని అదృష్టం వరించింది. అతని వలలో భారీ శంకర చేప చిక్కుకుంది. ఈ చేప బరువు సుమారు 340 కిలోలు ఉన్నట్లు గుర్తించారు. అతిపెద్ద చేప వలలో పడటంతో జాలర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అంత పెద్ద శంకర చేపను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ చేపను స్థానిక చేపల మార్కెట్‌లో 50 వేల రూపాయలకు విక్రయించారు. ఇంత పెద్ద సైజు శంకర చేపలు మత్స్యకారుల వలకు చిక్కడం చాలా అరుదుగా జరుగుతుందని స్థానిక మత్స్యకారులు తెలిపారు. చేపను ఒడ్డుకు తరలిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మ కోసం బుడ్డోడి సాహసం.. మాటల్లేవ్.. వీడియో చూడాల్సిందే
డాన్స్ అదరగొట్టిన చిన్నారి.. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌కి ఎవరైనా పడిపోవాల్సిందే
పొలం గట్టుపై బుసలు కొట్టిన 12 అడుగుల గిరినాగు.. షాకింగ్ వీడియో
కాఫీ రుచిని ఆస్వాదిస్తూ గన్ ఫైరింగ్.. సైనికుడి వీడియో వైరల్
మొండిగా ‘మగధీర’ సినిమాను కొన్నా.. కానీ ఆ తరువాతే !!