12 అడుగుల కొండచిలువ ..కోతిని మింగి ఎటూ కదలలేక వీడియో
వరంగల్ నగరంలో బట్టుపల్లి రోడ్ ప్రాంతంలో ఒక భారీ కొండచిలువ కారణంగా కలకలం చెలరేగింది. అమ్మవారిపేట క్రాస్ రోడ్ సమీపంలోని ఓ షోరూమ్ వద్ద సుమారు 12 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించడం స్థానికుల్లో భయాందోళనకు దారితీసింది. అది కదల్లేక ఒకచోటే పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. దగ్గరికి వెళ్లి చూశాక పరిస్థితి మరింత స్పష్టమైంది.
కొద్దిసేపటి ముందే ఆ కొండచిలువ ఒక కోతిని మింగేసి.. ఎటూ వెళ్లలేకపోతున్నట్లు గుర్తించారు. విషయం తెలియడంతో మరికొంతమంది ఆ ప్రాంతంలో గుమిగూడారు. దీంతో స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన ఫారెస్ట్ సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో సుమారు ఒక గంట పాటు శ్రమించి తర్వాత కొండచిలువను విజయవంతంగా బంధించారు. అనంతరం ఆ సర్పాన్ని సురక్షితంగా వరంగల్ వన విజ్ఞాన కేంద్రానికి తరలించారు. ప్రమాదం లేకుండా రక్షణ చర్యలు తీసుకున్న ఫారెస్ట్ సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :