ఘజియాబాద్‌లో వింత దొంగ.. ఇవి కూడా దొంగతనం చేస్తారా అని షాక్ అవుతున్న నెటిజన్స్ !!
దొంగలు పలు రకాలు అన్నట్టుగా.. ఇప్పటి వరకూ మీరు డబ్బు, నగలు, లేదా వాహనాలను దోచుకెళ్లే దొంగలను చూసి ఉంటారు. కానీ ఇక్కడ ఓ దొంగ వస్తువు కనబడాలే కానీ..
దొంగలు పలు రకాలు అన్నట్టుగా.. ఇప్పటి వరకూ మీరు డబ్బు, నగలు, లేదా వాహనాలను దోచుకెళ్లే దొంగలను చూసి ఉంటారు. కానీ ఇక్కడ ఓ దొంగ వస్తువు కనబడాలే కానీ.. చోరీకి కాదేదీ అనర్హం అంటున్నాడు. అతను ఏం చేసాడో తెలుసా.. డ్రైనేజీపైన సేఫ్టీ కోసం మూతలా వేసిన ఇనుప గ్రిల్‌ను ఎత్తుకుపోయాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓర్నీ.. ఏంది సామీ అది… నీ అవసరం కోసం ఇతరులను ప్రమాదంలోకి నెట్టేస్తావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రాత్రి సమయం..ఆ వీధిమొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఇంతలో ఓ వ్యక్తి స్కూటీమీద ఆ వీధిలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కన డ్రైనేజీపైన ఇనుప గ్రిల్స్ చూశాడు. అంతే.. వెంటనే తన ప్లాన్ అమలు చేసాడు. ఓ పెద్ద ఇనుప గ్రిల్‌ను తీసుకుని స్కూటీ మీద పెట్టుకుని తాపీగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లికూతురిని చూడగానే స్పృహతప్పి పడిపోయిన పెళ్లికొడుకు.. ఏం జరిగిందంటే ??
నడక నేర్చే వయసులో స్విమ్మింగ్ !! చేపలా ఈదుతున్న 16 నెలల బేబీ !!
ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం.. 120 ఏళ్లుగా.. ఎక్కడుందో తెలుసా ??
మహిళ కడుపులో కత్తెరలు !! ఎలా చేరాయో తెలిస్తే !!
ఇంటికి కాపలా కాస్తున్న భారీ నాగుపాము !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

