ఆలస్యంగా తల్లి కావాలనుకునే వారికి ఇది వరం.. వీడియో
ఆలస్యంగా తల్లి కావాలనుకునే మహిళలకు, ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన వారికి ఐవీఎఫ్ విధానంలో ఒక కొత్త ఆశ చిగురించింది. పిండాలను గర్భాశయంలో ప్రవేశపెట్టడానికి ముందే వాటిపై ఒక ప్రత్యేకమైన జన్యు పరీక్ష చేయడం ద్వారా గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయని, తక్కువ సమయంలోనే బిడ్డను కనవచ్చని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది.
ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆఫ్ క్లినికల్ మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి.సాధారణంగా ఎక్కువ వయసున్న మహిళల్లో ఏర్పడే పిండాలలో క్రోమోజోముల పరమైన లోపాలు ఉండే ప్రమాదం ఎక్కువ. దీనివల్లే ఐవీఎఫ్ ప్రయత్నాలు విఫలమవడం, గర్భస్రావాలు జరగడం వంటివి జరుగుతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు యూకేలోని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు PGT-A అనే పరీక్షపై దృష్టి పెట్టారు. ఈ పరీక్ష ద్వారా పిండాల్లోని క్రోమోజోముల సంఖ్యను ముందుగానే పరిశీలించి, ఆరోగ్యకరమైన పిండాలను మాత్రమే గర్భాశయంలోకి బదిలీ చేస్తారు.ఈ అధ్యయనం కోసం 35 నుంచి 42 ఏళ్ల మధ్య వయసున్న 100 మంది మహిళలను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపునకు పీజీటీ-ఏ పరీక్ష చేసిన పిండాలను, మరో గ్రూపునకు సాధారణ పిండాలను బదిలీ చేశారు. మూడుసార్లు పిండ బదిలీ చేసిన తర్వాత ఫలితాలను పరిశీలించగా, పీజీటీ-ఏ పరీక్ష చేయించుకున్న గ్రూపులో జననాల రేటు 72 శాతంగా ఉండగా, సాధారణ గ్రూపులో అది కేవలం 52 శాతంగానే నమోదైంది. ముఖ్యంగా, పీజీటీ-ఏ గ్రూపులోని మహిళలు తక్కువ ప్రయత్నాలలోనే గర్భం దాల్చినట్లు పరిశోధకులు గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం :
రన్నింగ్ ట్రైన్ ఎక్కబోతూ కిందపడ్డ మహిళ.. తర్వాత ఏమైందంటే? వీడియో
యువతి ప్రా*ణం తీసిన ట్రయాంగిల్ లవ్..వీడియో
రణ్‌బీర్ కపూర్, ఆలియా .. రూ. 250 కోట్ల లగ్జరీ భవనం చూశారా వీడియో