పైసా జీతం లేకుండా 32 ఏళ్లుగా ట్రాఫిక్‌ డ్యూటీ.. అతని జీవితంలో ఆ విషాదం..?

Updated on: Aug 01, 2025 | 4:45 PM

అది ఢిల్లీలోని రద్దీ ఎక్కువుండే ప్రాంతం సీలంపుర్‌ జంక్షన్‌. ఉదయాన్నే 8 గంటలకు అక్కడికి ఓ బక్కపల్చని వృద్ధుడు వస్తారు. ట్రాఫిక్‌ యూనిఫామ్‌ వేసుకుని వచ్చిపోయే వాహనాల రద్దీని కంట్రోల్ చేస్తారు. ఆయనను చూసి ఈ వయసులోనూ రిటైర్మెంట్‌ తీసుకోకుండా పనిచేస్తున్న ట్రాఫిక్‌ పోలీసు అని అనుకుంటారు ఎవరైనా..! కానీ, ఆయన పోలీసు కానీ పోలీసు.

32 ఏళ్లుగా పైసా జీతం తీసుకోకుండా ట్రాఫిక్‌ విధులు నిర్వర్తిస్తున్న శ్రమజీవి. ఆయనే 72 ఏళ్ల గంగారామ్‌. ఇంతకీ ఎవరీ తాత? ఏంటాయన కథ..? గంగారామ్‌ కుమారుడు చాలా సంవత్సరాల క్రితం ఇదే సీలంపూర్‌ జంక్షన్‌లో తన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు దూరమవ్వడంతో ఆ బాధ తట్టుకోలేక గంగారామ్‌ భార్య కూడా కన్నుమూసింది. అప్పటి నుంచి గంగారామ్‌ ఒంటరయ్యారు. అయితే, తనలాగ ఇంకో కుటుంబం ప్రియమైన వారిని కోల్పోయి బాధ అనుభవించకూడదని అప్పుడే నిశ్చయించుకున్నారు. అప్పటి నుంచి గత 32 ఏళ్లుగా తన కొడుకును కోల్పోయిన ఇదే సీలంపూర్‌ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ విధుల్లోకి దిగారు. ఆయన సేవలను గుర్తించిన ఢిల్లీ పోలీసు విభాగం 2018లో ట్రాఫిక్‌ సెంటినల్‌గా నియమించింది. యూనిఫారం, ఐడీ కార్డు అందచేసింది. పోలీసు విభాగం నుంచి వచ్చే ఆ కొద్ది మొత్తంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల ‘ఇన్‌స్టంట్‌ బాలీవుడ్‌’ అనే సోషల్‌ మీడియా పోస్ట్ ద్వారా ఆయన నెట్టింట వైరల్‌గా మారారు. ఈ తాత కథ తెలుసుకుని నెటిజన్ల హృదయాలు బరువెక్కాయి. సమాజం పట్ల ఆయనకున్న బాధ్యతకు సెల్యూట్‌ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజూ 8 గంటలు కదలకుండా కూర్చుంటున్నారా ?? అయితే ఈ వ్యాధులు మీకు దగ్గరపడుతున్నట్లే

నీటిని మరిగిస్తే బ్యాక్టీరియా చనిపోతుందా..? అధ్యయనంలో ఆశ్చర్యపోయే నిజాలు

కరోనా బాధితులకు ముందుగానే ముసలితనం.. సంచలనం రేపుతున్న లేటెస్ట్‌ అధ్యయనం

తిరుపతిలో బైకు వెంటపడిన చిరుత.. తృటిలో..

రౌడీ బాయ్‌ పై గట్టిగా.. కంబ్యాక్ ఇచ్చిపడేశావ్‌పో..