అసలైన టీ ఏదో.. మీకు తెలుసా ??
FSSAI టీ నిర్వచనంపై కీలక స్పష్టత ఇచ్చింది. తేయాకు మొక్క నుండి తయారైన పానీయాలను మాత్రమే 'టీ'గా గుర్తించాలని ఆదేశించింది. హెర్బల్, ఫ్లేవర్ కలిపిన ఇతర పానీయాలపై 'టీ' అని ముద్రించరాదని స్పష్టం చేసింది. తయారీదారులు, విక్రేతలు, ఈ-కామర్స్ సంస్థలు ఈ నియమాలను పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడం తప్పనిసరి.
టీలో రకాలు చెప్పమంటే వంద చెప్తాం..అల్లం టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీ ఇలా రకరకాల టీల పేర్లు చెబుతాం. అసలు టీ అని దేనిని పిలుస్తారు? టీ అని పేరున్న ప్రతిదీ టీ అయిపోతుందా అంటే కాదంటోంది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా. అవును, ‘టీ’అనే ఈ పదం పైన ఓ క్లారిటీ ఇస్తూ కీలక ప్రకటన చేసింది. తేయాకు మొక్క నుంచి తయారుచేసేది మాత్రమే టీ అని చెప్పింది. హెర్బల్, ఫ్లేవర్ వాటిని టీ అనడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తేయాకు లేని ఉత్పత్తులపై టీ అని ముద్రించవద్దని చెప్పింది. కాంగ్రా టీ, గ్రీన్ టీ, ఇన్‌స్టంట్ టీ లాంటి ఉత్పత్తులను కచ్ఛితంగా తేయాకుల నుంచే తయారుచేయాలని క్లియర్ గా తెలిపింది. ప్యాకేజింగ్‌పై అసలైన ఉత్పత్తుల వివరాలను తప్పక పొందుపరచాలంది. తేయాకు లేని ఉత్పత్తులపై ‘టీ’ అని ప్రింట్ చేయకూడదంది. మూలికలు, ఇతర మొక్కల ఆధారిత పానీయాలు “నాన్-స్పెసిఫైడ్ ఫుడ్” రూల్స్ 2017 పరిధిలోకి వస్తాయని వివరించింది. ఈ నిబంధనలను టీ తయారీదారులు, అమ్మేవాళ్లు, దిగుమతిదారులు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ వారు అందరూ తెలుసుకోవాలి, అలాగే అమలు చేయాలని చెప్పింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆహార భద్రత ప్రమాణాల చట్టం, 2006 ప్రకారం కఠిన చర్యలు తప్పవని FSSAI తెలిపింది. అన్ని రాష్ట్రాల ఆహార భద్రతా అధికారులు ఈ ఉత్తర్వులను అమలు చేయాలంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బుర్జ్ ఖలీఫా ఓనర్ బాక్‌గ్రౌండ్ చూస్తే మతిపోతుంది
టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా.. నిజమెంత ??
రైలు కోచ్‌లపై రకరకాల గీతలు.. ఎందుకో తెలుసా ??