భారత నెమలి సింహాసనం ఎత్తుకెళ్లిన ఇరాన్
మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన అపురూపమైన నెమలి సింహాసనం భారత వైభవానికి ప్రతీక. కోహినూర్ వజ్రం సహా అపార సంపదతో పొదగబడిన ఈ సింహాసనాన్ని 1739లో పర్షియా పాలకుడు నాదిర్ షా ఢిల్లీ నుండి ఇరాన్‌కు దోచుకెళ్లాడు. తరువాత అది కాలగర్భంలో కలిసిపోయింది, కేవలం దాని నమూనాలు మాత్రమే మిగిలాయి.
ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు ఇరాన్ చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో, చరిత్రకారులు భారత నెమలి సింహాసనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మొఘల్ సామ్రాజ్య వైభవానికి చిహ్నంగా వెలుగొందిన ఈ సింహాసనాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1628లో తయారు చేయించారు. స్వర్ణకారులు ఏడేళ్లు శ్రమించి, 1150 కిలోల బంగారంతో, 230 కిలోల మణులు, రత్నాలతో దీన్ని రూపొందించారు. కోహినూర్ వజ్రం, తైమూర్ రూబీ వంటి అపురూప రత్నాలు ఇందులో పొదగబడ్డాయి.
మరిన్ని వీడియోల కోసం :
