Current Shock : పెనువిషాదంగా మారిన గృహప్రవేశం వేడుక.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా..

|

Apr 19, 2023 | 8:51 PM

అప్పటివరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు చూస్తుండగానే విగతజీవిగా మారి అనంత లోకాలకు వెళ్లిపోతే ఎలా ఉంటుంది. అందులోనూ.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు-నలుగురు.. వాళ్లు కూడా ఓకే కుటుంబానికి చెందినవాళ్లు.. ఊహించడానికే కష్టంగా ఉంది..

జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలం కానుకమాకులపల్లెలో ఓ కుటుంబం కొత్తగా ఇంటిని నిర్మించుకుని గృహప్రవేశానికి సిద్ధమైంది. ఇంటిముందు టెంట్‌ ఏర్పాటుచేశారు. బంధుమిత్రులంతా గృహప్రవేశ కార్యక్రమ నిర్వహణకోసం హడావిడిగా పనులు చేస్తూ ఉన్నారు. ఇంతలో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా పెను గాలులు వీచాయి. దాంతో టెంట్‌ కూలి పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలపై పడింది. ఆ టెంట్‌లో ఉన్న నలుగురు విద్యుత్‌ తీగలు తగలడంతో షాక్‌ కొట్టి ఇద్దరు స్పాట్‌లోనే మృతిచెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని బి కొత్తకోట మండలంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక.. మృతులను లక్ష్మమ్మ, శాంతమ్మ, లక్ష్మన్న, ప్రశాంత్‌గా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో వేడుక జరుగుతున్న ఆ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. శుభాకార్యం జరగాల్సిన ఇంట విషాద ఘటనతో చావు మేళం మోగింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..