అడవిలో అడ్డంగా దొరికిన ప్రేమ జంట.. పోలీసులు వెళ్లేసరికి

Updated on: May 15, 2025 | 4:04 PM

అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని అడవుల్లో అసాంఘిక కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి. సహజ అందాలకు తలమానికంగా వున్న తలకోన ఫారెస్ట్‌ ఏరియాలోని నిషేధిత ప్రాంతాల్లో మందుబాబులు విందులతో చిందులేస్తున్నారు. నిజానికి తలకోన ఫారెస్ట్‌ను సందర్శించాలంటే పక్కాగా అధికారుల అనుమతి తీసుకోవాలి. మద్యం సేవించడం..గుమగూడడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు.

కానీ ఇటీవల కొంత కాలంలో తలకోనలో మందు పార్టీల సందడి పెరిగింది. సైట్‌ సీయింగ్‌తో పాటు పార్టీలు చేసుకోవచ్చంటూ కొందరు కేటుగాళ్లు సోషల్‌ మీడియా గ్రూపుల ద్వారా యువతకు గాలం వేస్తున్నారు. ట్రెక్కింగ్‌, వాటర్‌ ఫాల్స్‌తో పాటు మందు పార్టీలకు అనుమతి వుందని ట్రాప్‌ చేస్తున్నారు. నిజమేనని నమ్మి వస్తున్న యువత సదరు కేటుగాళ్ల చేతిలో మోసపోతున్నారు. పోలీసులమని బెదిరిస్తూ యువతను నిలువుదోపిడి చేస్తున్న నకిలీపోలీసుల వ్యవహారం ఇటీవల సంచలనం రేపింది. పర్యాటకులను బెదిరిస్తూ డబ్బులు దండుకుంటున్న వైనాలు కలకలం రేపాయి. తలకోనను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే.. ఫారెస్ట్‌ అధికారులు నిర్లక్ష్యం వల్ల తలకోనలో అసాంఘీక శక్తుల ఆగడాలు పెరిగిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తలకోనలో మందుపార్టీలపై సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఫారెస్ట్‌ ఏరియాలోకి ప్రవేశించడమే కాకుండా మందు పార్టీలు చేసుకుంటున్న పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అనకాపల్లి జిల్లాలో 13 అడుగుల కింగ్ కోబ్రా కలకలం

పురుషులకు ఈ మొక్క ఓ వరం.. కనిపిస్తే వదలకండి..!

వేసవిలోనూ అల్లం టీ తాగుతున్నారా..?

వలలో చిక్కింది చూసి ఆశ్చర్యపోయిన జాలరి

అప్పడాలు ఇష్టమని లొట్టలేసుకొని లాగించేస్తున్నారా..!

Published on: May 15, 2025 03:38 PM