Flyover collapses Video: కూలిన ఫ్లై ఓవర్.. పలువురికి గాయాలు..!ఈ వంతెన స్పెషల్ ఏంటంటే..(వీడియో)

Updated on: Sep 19, 2021 | 4:20 PM

ఆర్ధిక రాజధాని ముంబైలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పదిమందికి పైగా కార్మికులు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

ముంబై నగరంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ ఒక్కసారిగా కుప్ప కూలింది. ఈ ఘటనలో 10 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఫ్లైఓవర్‌ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 16 తెల్లవారుఝామున 4 గంటల 40 నిమిషాల సమయంలో ఫ్లైఓవర్ కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో సహాయక చర్యలు చేపట్టారు. కాగా గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాణ్యత లోపం వల్లనే ఫ్లై ఓవర్ కూలింద‌ని ప‌లువురు అంటున్నారు. ఈ ప్రమాదంపై అధికారిక స‌మాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Tamannaah Video: కొత్త కొత్త పాత్రల్లో నటిస్తే ఆ కిక్కే వేరంటున్న తమన్నా..(వీడియో).

 Khel Duniya With Satya: టెన్నిస్‌స్టార్‌ నడాల్ అంటే మనకెందుకంత ఇష్టం..?(వీడియో)

 Smart Work Video: స్మార్ట్‌ వర్క్‌..అంటే ఇదేమరీ! చూస్తే అవాక్కే..! కండ బలం కంటే బుద్ధి బలమే గొప్పదని చెబుతున్న వీడియో.

 Copy cat viral video: నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్న కాపీక్యాట్‌ ఫన్నీ సీన్స్‌.. వీడియో తీసిన మహిళ..