చుట్టూ ఈదుతున్న చేపలు.. వాటి మధ్య లంచ్‌

Updated on: Nov 18, 2025 | 6:48 PM

థాయ్‌లాండ్‌లోని ఓ రెస్టారెంట్‌కు వరదలు ఊహించని అదృష్టాన్ని తెచ్చాయి. నది ఉప్పొంగి రెస్టారెంట్‌లోకి నీరు చేరడంతో చేపల మధ్య భోజనం చేసే వినూత్న అనుభూతి కస్టమర్‌లను ఆకర్షించింది. దీంతో యజమానురాలి వ్యాపారం రెట్టింపైంది. ఇప్పుడు ఈ 'వరద రెస్టారెంట్‌' ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి, ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

థాయ్‌లాండ్‌లో ఓ నది ఉప్పొంగి వరద పోటెత్తడం ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ యజమానురాలికి కలిసొచ్చింది. చేపల మధ్య భోజనం చేయడానికి జనం పోటెత్తారు. వరద నీటిలో కూర్చున్నాక.. కాళ్ల కింద చేపలు చేసే సందడి చూస్తూ.. సరదాగా భోజనం చేస్తూ ఆస్వాదిస్తున్నారు. సాధారణంగా రెస్టారెంట్లలోకి నీరు చేరితే యజమానులు కన్నీళ్లు పెట్టుకుంటారు. థాయ్‌లాండ్‌లోని ఈ రెస్టారెంట్‌ యజమాని కూడా ఆందోళనపడ్డారట. 30 ఏళ్లుగా ఆమె రెస్టారెంట్‌ నడుస్తోంది. కస్టమర్‌లు ఎవరూ రారు అనుకున్నారట. కానీ ఓ కస్టమర్‌ ఇక్కడ చేపలు ఉన్నాయని ఆన్‌లైన్‌లో పోస్ట్‌ పెట్టడంతో చాలా మంది ఇక్కడ తినడానికి గుమిగూడారు అని ఆమె గుర్తు చేసుకున్నారు. వరదల కారణంగా తన వ్యాపారం పెరిగిందని, తన లాభం రెట్టింపయ్యిందని ఆమె అన్నారు. ఆమెకు మాత్రం వరద నీరే అదృష్ట దేవతగా మారింది! డైనింగ్‌ టేబుళ్ల మధ్య ఈదే చేపలు కస్టమర్లకు అద్భుతమైన అనుభూతిని అందిస్తున్నాయి. ఈ వింత రెస్టారెంట్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది. ఆహారం ఆస్వాదిస్తూ.. కాళ్ల దగ్గర ఈదే చేపలను చూసేందుకు ఇక్కడ జనం బారులు తీరుతున్నారు. నీటిలో కూర్చుని ఫొటోలు దిగడానికి, చేపలకు మేత వేస్తూ ఆ హడావిడిని ఫొటోలు తీయడానికి కస్టమర్‌లు ఉత్సాహం చూపిస్తున్నారు. బ్యాంకాక్‌లోని పా జిత్‌ రెస్టారెంట్‌లో కుటుంబాలు లంచ్‌ ఆస్వాదిస్తున్నాయి. చుట్టూ చేపలు ఈదుతుంటే చిన్నపిల్లలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వెయిటర్లు చేపల సూప్‌ , చికెన్‌ నూడుల్స్‌ గిన్నెలను నేర్పుతో టేబుల్స్‌ వద్దకు తీసుకొస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

30 రోజుల్లో 10 కేజీలు తగ్గి.. స్టేజ్‌ పై కుప్పకూలిన సింగర్‌

దినసరి కూలీకి రూ.35 కోట్ల జీఎస్‌టీ బిల్లు

బంపర్‌ ఆఫర్‌ పిల్లలను కంటే రూ. 30 లక్షలు

దారుణం.. యజమానిని కట్టేసి భారీ దోపిడీ

దుర్గమ్మ ఆలయంలో అద్భుతం.. చూడటానికి రెండు కళ్ళు చాలవు