బాహుబలి వల.. 50 టన్నుల చేపలు చిక్కాల్సిందే..

|

Jan 15, 2025 | 5:03 PM

అది బాహుబలి వల... దానితో చేపలు పట్టాలంటే.. దాదాపు 100 మంది జాలర్లు అవసరం అవుతారు. దాన్ని సిద్దం చేయడం కూడా అంత ఈజీ టాస్క్ కాదు. కానీ ఒక్కసారి వల వేశారంటే.. టన్నుల కొద్దీ జల సంపద చేజిక్కినట్టే. ఈ వలను అరుదుగా మాత్రమే వినియోగిస్తారు జాలర్లు. బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరానికి ఒక ప్రత్యేకత ఉంది.

పర్యాటక కేంద్రంగా సూర్యలంక బీచ్ పేరుగాంచడమే కాకుండా ఇక్కడ సీజన్ మొదట్లో లభించే మత్తి, మక్కే చేపలకు కూడా ప్రత్యేకత ఉంది. ఈ రకం చేపలను తమిళనాడు, కేరళకు ఎగుమతి చేస్తుంటారు. వీటిని పట్టుకోడానికే..భారీ వలను తయారు చేశారు మత్స్యకారులు. వాయిస్‌02: దాదాపు కిలో మీటర్ పొడవుండే ఈ వలను ఐలా అంటారు. ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల విలువుండే వలతో ఒక్కసారి వేట సాగించారంటే ఐదు టన్నుల నుండి యాభై టన్నుల చేప వలకు చిక్కుతుంది. ఈ వలను వేయడానికి ఒకేసారి వంద మంది మత్స్యకారులు అవసరమవుతారు. వీరితో పాటు వలలో చిక్కిన మత్తి, మక్కే చేపలను ఏరడానికి మరో 150 మంది కూలీలు కూడా ఉంటారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??

బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌

గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..

విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..

గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుని వెళ్తే.. పోలీసులకు ఊహించని షాక్..