వలకు దొరికిన తోడేలు చేప.. ఎంత భయంకరంగా ఉందో చూడండి

సముద్రం చాలా గొప్పది.. చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది.. ఈ డైలాగ్‌ మహా సముద్రం సినిమాలోనిదే అయినా.. సముద్రంలో కొన్ని వింత జీవాలను చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది.

Phani CH

|

Aug 08, 2022 | 9:49 AM

సముద్రం చాలా గొప్పది.. చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది.. ఈ డైలాగ్‌ మహా సముద్రం సినిమాలోనిదే అయినా.. సముద్రంలో కొన్ని వింత జీవాలను చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది. సముద్రాల్లో రకరకాల చేపలతో పాటు భయంకరమైన జీవాలు కూడా ఉంటాయి. అయితే తాజాగా ఓ భయంకరమైన చేప ఓ మత్స్యకారుడి వలకు చిక్కింది. అదే తోడేలు చేప. అవును మీరు విన్నది నిజమే.! ఈ చేప చూసేందుకు అచ్చం తోడేలు రూపంలో ఉంది. భయంకరమైన ఆకారంతో రాకాసిలా.. పెద్దగా నోరు తెరుచుకుని ఉంది ఈ తోడేలు చేప. అయితే ఇలాంటి చేపలను తోడేలు చేపలని అంటారని, నీళ్లు లేకున్న బురదలో కూడా ఇది జీవించగలదని తెలిపాడు మత్స్యాకారుడు. అయితే చేతిలో పట్టుకున్న ఈ చేప మత్స్యాకారుడి చేతిని కొరికేందుకు పలు సార్లు ప్రయత్నించింది. కానీ అతడు చాకచక్యంగా దానిని పట్టుకుని ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. అయితే ఇలాంటి చేపలు దొరికినప్పుడు తాము మళ్లీ వాటిని సముద్రంలోనే వదిలేస్తామని తెలిపాడు. ఈ ఘటనలో అమెరికాలో చోటు చేసుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: వరుడిపైకి దూకి మరీ దాడి చేసిన వధువు

లైక్స్‌ కోసం స్కేట్‌ బోర్డ్‌ ట్రై చేసి.. బొక్కబోర్లా పడిన యువతి

తంబీలకు పవన్ అంటే ఇంత పిచ్చా.. రక్తాన్ని కూడా లెక్కచేయట్లేగా !!

Macherla Niyojakavargam: ఇక యాక్షనే.. మాచర్ల మైండ్‌ బ్లోయింగ్ ప్రోమో..

‘వాడు నన్ను 6ఏళ్లుగా వేధిస్తున్నాడు’ హీరోయిన్‌కూ..తప్పని కీచకుడి బాధ

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu