ప్రకృతి ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంది. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. దాంతో అందరి దృష్టి దానిపై పడుతుంది. భూమిపై ప్రకృతిచే సృష్టించబడిన మిలియన్ల జీవులు ఉన్నప్పటికీ, మానవులకు ఏజీవి గురించి కూడా పూర్తిగా తెలియదు.
ప్రకృతి ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంది. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. దాంతో అందరి దృష్టి దానిపై పడుతుంది. భూమిపై ప్రకృతిచే సృష్టించబడిన మిలియన్ల జీవులు ఉన్నప్పటికీ, మానవులకు ఏజీవి గురించి కూడా పూర్తిగా తెలియదు. అలాంటి జీవి ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఓ తెల్ల రంగు కప్ప వీడియో చూసిన తర్వాత నెటిజన్లు ఎంతో ఆశ్చర్యపోతున్నారు.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక తెల్లని కప్ప ఉంది.. అది రోబోట్‌లా కనిపిస్తుంది. కప్ప కళ్ళు లెన్స్ లాగా పైకి స్థిరంగా ఉన్నాయి. దాని గోళ్లు చూస్తే నీలం రంగులో ఉన్నాయి. ఈ రకమైన కప్పలు ప్రపంచంలో ప్రతిచోటా కనిపించినా.. ఇది మాత్రం చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఈ కప్పను అమెజానియన్ మిల్క్ ఫ్రాగ్ అని పిలుస్తారట. ఈ కప్ప చాలా విషపూరితమైనదట. దాని చర్మంలో విషం కారణంగా ఇతర వేటాడే జీవులనుంచి తనను తాను రక్షించుకుంటుందట. ఈ కప్పలు చెట్లలోను, మొక్కల చుట్టూ నివసిస్తాయట. ఈ తెల్లని కప్పను చూసిన నెటిజన్లు ఇలాంటి కప్పను ఇంతకుముందెప్పుడూ చూడలేదంటూ ఆశ్చర్యపోతున్నారు.