నోయిడాలో పేలుతున్న ఏసీలు.. మరి మీ ఏసీ సేఫేనా ??

|

Jun 06, 2024 | 2:49 PM

ఇంట్లో నిత్యం వాడే వస్తువుల నిర్వహణ ఎంత ముఖ్యమో చెప్పే ఘటన ఇది. నిర్వహణ లోపంతో నోయిడాలోని ఓ హైరైజ్ అపార్ట్‌మెంట్‌లోని పదో అంతస్తులో ఏసీ భారీ శబ్దంతో పేలి మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగలు రావడంతో అపార్ట్‌మెంట్ వాసులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఫైర్ సర్వీస్ విభాగం వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.

ఇంట్లో నిత్యం వాడే వస్తువుల నిర్వహణ ఎంత ముఖ్యమో చెప్పే ఘటన ఇది. నిర్వహణ లోపంతో నోయిడాలోని ఓ హైరైజ్ అపార్ట్‌మెంట్‌లోని పదో అంతస్తులో ఏసీ భారీ శబ్దంతో పేలి మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగలు రావడంతో అపార్ట్‌మెంట్ వాసులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఫైర్ సర్వీస్ విభాగం వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అక్కడే ఓ ఐటీ కంపెనీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఈ రెండు ఘటనల్లోనూ ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వేసవి ఉష్ణోగ్రతల వల్లే ఇలా జరిగిందని చాలామంది భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే కారణం అది కాదు. నిర్వహణ లేకపోవడమే ఇలాంటి వాటికి కారణం అవుతుంటాయి. వెంటిలేషన్ సరిగా లేకపోవడం, ఫిల్టర్లు మూసుకుపోవడం, ఏజింగ్ యూనిట్ల వల్ల ఓవర్ హీటింగ్ అనేది ఓ సాధారణ సమస్యలా మారిపోతోంది. కాబట్టే నిత్యం వీటికి మెయింటెనెన్స్ తప్పనిసరి. లేదంటే జరిగేది ఇలాంటి ప్రమాదాలే. మరి ఎలాంటి భయం లేకుండా ఏసీ నుంచి వచ్చే హాయిని ఆస్వాదించాలంటే ఏం చేయాలి? వాస్తవానికి ఇండియా వంటి అధిక ఉష్ణోగ్రత కలిగిన దేశాల్లో ఏసీ నిర్వహణ అనేది అత్యంత ముఖ్యమైన విషయం. ఏసీలో మంటలు నివారించేందుకు ఇంటి యజమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కీళ్లనొప్పులకు పెయిన్‌కిల్లర్స్‌ వాడుతున్నారా.. జాగ్రత్త

తల్లి ప్రేమ.. తప్పుడు పని చేయించింది.. అసలు ఏం జరిగిందంటే

ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

ట్రైన్లో మీ ​ సీట్లో మరొకరు కూర్చున్నారా ?? గొడవ పడకండి.. ఇలా ఫిర్యాదు చేయండి

Mamitha Baiju: మమితాను ఉక్కిరి బిక్కిరి చేసిన ఫ్యాన్స్‌ దెబ్బకు దడుసుకుంది పో

Follow us on