ఆటో దొంగిలించకుండా పాము కాపలా !!

|

Sep 28, 2023 | 10:37 PM

వర్షాకాలం వచ్చిందంటే చాలు పాములు సర్వసాధారణంగా ప్రతి చోటా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పల్లెల్లో .. అడవి సమీప ప్రాంతాల్లో ఎక్కువగా రకరకాల పాములు కనిపిస్తాయి. తాజాగా ఓ పాము ఏకంగా రన్నింగ్ ఆటోలో ప్రత్యక్షమైంది. అదీ మెల్లమెల్లగా పాకుతూ ఆటో ముందు భాగంలో నంబర్ ప్లేట్‌ను చుట్టుకుని వేలాడింది. ఆ సమయంలో పడగ విప్పిన పాము తన దగ్గరకు వచ్చిన వారిని కాటు వేసేందుకు బుసలు కొడుతూ కనిపించింది.

వర్షాకాలం వచ్చిందంటే చాలు పాములు సర్వసాధారణంగా ప్రతి చోటా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పల్లెల్లో .. అడవి సమీప ప్రాంతాల్లో ఎక్కువగా రకరకాల పాములు కనిపిస్తాయి. తాజాగా ఓ పాము ఏకంగా రన్నింగ్ ఆటోలో ప్రత్యక్షమైంది. అదీ మెల్లమెల్లగా పాకుతూ ఆటో ముందు భాగంలో నంబర్ ప్లేట్‌ను చుట్టుకుని వేలాడింది. ఆ సమయంలో పడగ విప్పిన పాము తన దగ్గరకు వచ్చిన వారిని కాటు వేసేందుకు బుసలు కొడుతూ కనిపించింది. ఓ వ్యక్తి ఆటో నుంచి పామును తరిమేందు కు ప్రయత్నించగా అతనిపై దాడి చేసేందుకు యత్నించింది. అంతేకాదు పామును వీడియో తీస్తున్న వ్యక్తిని సైతం కాటేసేందుకు దూసుకువచ్చింది. చివరికి స్నేక్ క్యాచర్ సాయంతో పామును అక్కడి నుంచి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఆటోకి చుట్టుకున్న ఈ నాగుపాము ప్రపంచంలోని అత్యంత విషపూరిత పాముల్లో ఒకటిగా స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు. ఇది దిగ్భ్రాంతికరమైన దృశ్యమని కొందరు, ఈ ఆటోను ఎవరూ దొంగిలించకుండా పాము కాపలాగా మారిందని మరికొందరు సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఆటో నంబర్‌ ప్లేట్‌ను పరిశీలిస్తే అది జార్ఖండ్‌కు చెందినదై ఉంటుందని తెలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జాతీయ రహదారిపై కోతిపిల్లను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం !! ముగ్గురు వ్యక్తులు సపర్యలు

వీడు దొంగే…. కానీ నిజాయితీ ఉన్నోడు.. తనిఖీలో పట్టుబడ్డ వాహనాలు

అరగంటపాటు గాల్లో తలక్రిందులుగా వేలాడిన జనం !! అసలు ఏం జరిగిందంటే ??

రంగులు మార్చే ఊసరవెల్లి చీర !! తయారీకి రూ. 2.8 లక్షలు ఖర్చు

ఏసీ వేసుకొని నిద్రపోయిన డాక్టర్.. అప్పుడే పుట్టిన ఇద్దరు బిడ్డలు మృతి