కొడుకు ప్రాణాల కోసం.. మొసలితో తల్లి ఫైటింగ్ వీడియో
బిడ్డ మీద తల్లికి ఉండే ప్రేమ మాటల్లో వర్ణించలేనిది. బిడ్డకు ఆపద ఉన్నదంటే తల్లి తన ప్రాణాలను అడ్డేసైనా కాపాడుకుంటుంది. మనిషి అయినా, జంతువు అయినా తన పిల్లల మీద ఉండే ప్రేమ అలాంటిది. ప్రస్తుతం అలాంటి ఘటనే ఓ చోట జరిగింది. తన ఐదేళ్ల కుమారుడిని కాపాడుకోవడానికి ఓ తల్లి ఏకంగా మొసలితో అరవీర భయంకరంగా తలపడింది.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బహ్రాయిచ్‌లోని ధాకియా గ్రామంలో చోటుచేసుకుంది. ఇంటి దగ్గర చిన్న కాలువ వద్ద బాలుడు ఆడుకుంటున్న సమయంలో ఓ మొసలి అకస్మాత్తుగా నీటి నుండి బయటకు వచ్చి బాలుడిని పట్టుకుంది. మొసలి బాలుడిని నీటిలోకి లాక్కెళ్ళడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో బాలుడి అరుపులు విన్న తల్లి మాయ శివంగిలా మారింది. మొసలితో పోరాటం చేసి బిడ్డను కాపాడుకుంది. మొసలితో మాయ ఐదు నిమిషాలపాటు వీరోచితంగా పోరాడినట్లు స్థానికులు తెలిపారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమె తన చేతులతో మొసలిని కొడుతూ తన కొడుకును రక్షించుకుంది. తరువాత ఆమెకు ఒక ఇనుప రాడ్ దొరకడంతో మొసలిపై బలంగా దాడి చేసింది. దీంతో వెంటనే మొసలి బాలుడిని వదిలిపెట్టింది. ఈ పోరాటంలో తల్లి మాయతో పాటు కుమారుడు ఇద్దరూ గాయపడ్డారు. మాయకు స్వల్ప గాయాలు కాగా, కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటన అనంతరం మొసలిని బంధించడానికి అధికారులు రంగంలోకి దిగారు.
మరిన్ని వీడియోల కోసం :