ఎన్ని కోట్లు పెట్టి కొంటే ఏం లాభం.. ఆఖరికి ఎడ్ల బండితో లాగాల్సి వచ్చింది

|

Jan 08, 2025 | 12:27 PM

అనువుగానిచోట అధికులమనరాదు.. విశ్వదాభిరామ వినురవేమ అనే వేమన శతకం ఈ కారుకు సరిపోయింది. కోట్ల రూపాయల ఖరీదైన ఫెరారీ కారుకు మహారాష్ట్ర బీచ్‌లో ఇదే పరిస్థితి ఎదురైంది. ఎంత ఖరీదైన కారు ఉన్నా ఏం లాభం.. ఆఖరికి ఎడ్ల బండే దిక్కయింది వారికి. ఎడ్ల బండి వచ్చి లాగితే గానీ బయటపడలేని స్థితి వారిది. ఖరీదైన లగ్జరీ రేస్‌ కారు బీచ్‌లోని ఇసుకలో కూరుకుపోవడంతో.. దానిని బయటకు తీసేందుకు కొందరు ప్రయత్నించి విఫలమయ్యారు.

చివరకు ఎడ్లబండి సహాయంతో ఆ కారును బయటకు లాగారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. సముద్రపు అలలను చూస్తూ బీచ్‌లో రయ్‌మని కారు రైడింగు చేయడమంటే చాలామందికి సరదా. ఈ అనుభూతి కోసం ముంబయి నుంచి రాయ్‌గఢ్‌ సమీపంలోని రేవ్‌దండా బీచ్‌కు ఫెరారీ కారులో వెళ్లిన ఇద్దరు ఔత్సాహికులకు చేదు అనుభవం తప్పలేదు. సముద్ర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ బీచ్‌లో ముందుకుసాగిపోతున్న క్రమంలో వీరి కారు ఇసుకలో కూరుకుపోయింది. చుట్టుపక్కల ఉన్నవారంతా వచ్చి బయటకు లాగే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. లగ్జరీ కారును తీసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించి విఫలమయ్యారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లాటరీ చరిత్రను తిరగరాసే ఘటన.. రూ.10 వేల కోట్ల జాక్‌పాట్‌ టిక్కెట్ అమ్మకం !!