రూ. 2.5 కోట్ల ఫెర్రారి కారు కొన్న గంటకే కాలిబూడిద.. వీడియో
ఖరీదైన కారును సొంతం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి కల. ఇందుకోసం కోటీశ్వరులు ఎంత ఖర్చు కైనా వెనకాడరు. అయితే పదేళ్ల వెయిటింగ్ పీరియడ్ తర్వాత కష్టపడి దాచుకున్న సొమ్ముతో ఓ సామాన్యుడు కొన్న కారు, తర్వాతి గంటకే కాలిబూడిదైతే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న కారు మంటల్లో కాలి బూడిదవ్వడంతో ఓ జపనీయుడు తన ఆవేదనను ఎక్స్ వేదికగా వెళ్లగక్కాడు. ఎంతో ఇష్టపడి ప్రత్యేకంగా తయారు చేసిన ఫెర్రారి 458 స్పైడర్ కారును అతని 2.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సొంతం చేసుకున్నాడు.
అతనే టోక్యోకి చెందిన మ్యూజిక్ ప్రొడ్యూసర్ హాన్‌కాన్. పదేళ్ల పాటు ఆదా చేసిన డబ్బుతో తను మెచ్చిన ఫెర్రారి కొనుగోలు చేసాడు. డెలివరీ అయిన గంటలోపే ఆ కారు టోక్యో ఎక్స్‌ప్రెస్‌వే పై నిప్పంటుకుంది. 20 నిమిషాలకి మంటలార్పేసినప్పటికీ అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. ద సన్ పత్రిక కథనం ప్రకారం కారును డ్రైవ్ చేస్తుండగా మంటలు రావడం గమనించిన హన్‌కాన్, వెంటనే ఆపి డోర్ తెరుచుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. మంటలు చెలరేగడానికి కారణం ఏమై ఉంటుందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్స్‌లోని పోస్ట్‌లో హన్‌కాన్.. బహుశా జపాన్ మొత్తంలో తనలాంటి దురదృష్టవంతుడు ఎవరూ ఉండకపోవచ్చనీ వాపోయాడు. కారు ఎక్కడ పేలుతుందోపని తీవ్రంగా భయపడినట్లు చెప్పుకొచ్చాడు.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
