Female Health: ఆడవారికి కోసమే ఈ వీడియో.. ఆ అలవాట్లు ఉంటే గర్భాశయ సమస్యలు..

|

Jul 13, 2024 | 5:36 PM

ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా సంతానలేమి కేసులు పెరుగుతున్నాయి. ఇది పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేయవచ్చు. అయితే.. మహిళల్లో వంధ్యత్వానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ స్త్రీల ఆహార అలవాట్లు కూడా వారి సంతానోత్పత్తి క్షీణతకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. సంతానోత్పత్తిని కాపాడుకోవడంలో ఆరోగ్యకరమైన సమతుల ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా సంతానలేమి కేసులు పెరుగుతున్నాయి. ఇది పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేయవచ్చు. అయితే.. మహిళల్లో వంధ్యత్వానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ స్త్రీల ఆహార అలవాట్లు కూడా వారి సంతానోత్పత్తి క్షీణతకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. సంతానోత్పత్తిని కాపాడుకోవడంలో ఆరోగ్యకరమైన సమతుల ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎక్కువ బరువు పెరగడం లేదా చాలా తక్కువ బరువు ఉండటం రెండూ అండోత్పత్తిపై ప్రభావం చూపుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం వల్ల అండోత్పత్తి, గర్భాశయ సమస్యలు తలెత్తుతాయంటున్నారు.

ధూమపానం, మద్యపానం మొత్తం ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాకుండా ఇది సంతానోత్పత్తిని కూడా తగ్గిస్తుంది. ధూమపానం ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తుంది.. ఇంకా అండాశయాలను దెబ్బతీస్తుంది. అదే సమయంలో, ఆల్కహాల్ అధిక వినియోగం ఋతు చక్రం సక్రమంగా రాకుండా చేయడం.. గర్భందాల్చే అవకాశాలను తగ్గిస్తుంది. రెగ్యులర్ వ్యాయామం ఋతు చక్రం క్రమబద్ధీకరించడానికి, గర్భాశయం ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలా అరి అధిక వ్యాయామం చేయడం కూడా సరికాదంటున్నారు. అధిక వ్యాయామం ఋతు చక్రంపై ప్రభావం చూపుతుందట. ఒత్తిడి కూడా హార్మోన్లు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఒత్తిడి వలన అండోత్పత్తి ఆలస్యం అవుతుంది.. గర్భాశయంలోని పొర సన్నబడటం వలన గర్భధారణ కష్టమవుతుంది. క్రమరహిత లేదా బాధాకరమైన ఋతుస్రావం వంధ్యత్వానికి దారితీసే అంతర్లీన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on