Indigo Airlines: విమానంలో మహిళకు ప్రాణాపాయం..తోటి ప్రయాణికుడి రియాక్షన్‌..!

|

Jun 28, 2023 | 8:53 AM

ఇటీవల విమానాల్లో రకరకాల ఇన్సిడెంట్స్‌ చోటుచేసుకుంటున్నాయి. చాలామంది చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడం మనం చూశాం. ఒక్కోసారి విమానంలో ప్రయాణిస్తుండగా అనుకోకుండా అనారోగ్యం బారిన పడుతుంటారు.

ఇటీవల విమానాల్లో రకరకాల ఇన్సిడెంట్స్‌ చోటుచేసుకుంటున్నాయి. చాలామంది చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడం మనం చూశాం. ఒక్కోసారి విమానంలో ప్రయాణిస్తుండగా అనుకోకుండా అనారోగ్యం బారిన పడుతుంటారు. అలా ఓ మహిళా ప్రయాణికురాలు ఉన్నట్టుండి అస్వస్థతకు గురైంది. అది గమనించిన తోటి ప్రయాణికుడు ఆమెకు గుండెపోటు వచ్చిందని గరహించి వెంటనే ఆమెకు సీపీఆర్‌ చేసి ఆమె ప్రాణాలు కాపాడారు.

జూన్‌ 23న బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఇండిగో 6సీ 869 విమానం బయలుదేరింది. మార్గమధ్యంలో రోసమ్మ అనే 60 ఏళ్ల మహిళకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. తీవ్రమైన గుండె నొప్పితో ఆమె విలవిల్లాడిపోయింది. అదే ఫ్లైట్‌లో ఉన్న మరో ప్రయాణికుడు వైద్యుడు అయిన ఓ వ్యక్తి వెంటనే అందరినీ అలర్ట్‌ చేసి, ఆమెకు సీపీఆర్ చేసి ప్రమాదం గట్టెక్కించారు. విమానం ఢిల్లీలో లాండ్ అవగానే సిబ్బంది మహిళను ఆసుపత్రికి తరలించారు. తోటి ప్రయాణికుడు తక్షణం స్పందించడంతో మహిళకు ప్రాణాపాయం తప్పిందని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..