నాగలి పట్టే రైతులు క్రికెట్‌ బ్యాట్‌ పట్టి పరుగులు !! ఉత్సాహంగా పాల్గొన్న అన్నదాతలు

|

Sep 18, 2023 | 7:32 PM

నాగలి పట్టి దుక్కిదున్ని పంటలు పండించే రైతులు తాజాగా క్రికెట్‌ బ్యాట్‌ పట్టారు. నిత్యం వ్యవసాయ పనులతో కాయకష్టం చేసే రైతులు ఆటవిడుపుగా క్రికెట్‌ టోర్నీ నిర్వహించుకున్నారు. రంజీట్రోఫీ రేంజ్‌లో రైతుల క్రికెట్‌ మ్యాచ్‌ సాగింది. అన్నదాతల క్రికెట్‌ మ్యాచ్‌ ఇప్పడు సోషల్‌ మీడియాలో పరుగులు పెడుతోంది. అన్నింట్లో అన్నదాతకు లేరు సాటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిర్మల్‌ జిల్లా భైంసా మండలం కత్గాం గ్రామ రైతులు ఈ క్రికెట్‌ టోర్నీ నిర్వహించారు.

నాగలి పట్టి దుక్కిదున్ని పంటలు పండించే రైతులు తాజాగా క్రికెట్‌ బ్యాట్‌ పట్టారు. నిత్యం వ్యవసాయ పనులతో కాయకష్టం చేసే రైతులు ఆటవిడుపుగా క్రికెట్‌ టోర్నీ నిర్వహించుకున్నారు. రంజీట్రోఫీ రేంజ్‌లో రైతుల క్రికెట్‌ మ్యాచ్‌ సాగింది. అన్నదాతల క్రికెట్‌ మ్యాచ్‌ ఇప్పడు సోషల్‌ మీడియాలో పరుగులు పెడుతోంది. అన్నింట్లో అన్నదాతకు లేరు సాటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిర్మల్‌ జిల్లా భైంసా మండలం కత్గాం గ్రామ రైతులు ఈ క్రికెట్‌ టోర్నీ నిర్వహించారు. కామెంటరీ, అంపైర్‌, ఆడియన్స్‌ కేరింతలతో మైదానం మార్మోగింది. రైతులు ఉత్సాహంగా మైదానంలో పరుగులు తీశారు. ఈ టోర్నీ గ్రామ సర్పంచ్‌, గ్రామానికి చెందిన మరికొందరు యువకుల సహకారంతో ఎంతో సరదాగా సాగాయి. వీడియో చూసిన నెటిజన్లు రైతుల క్రికెట్‌ మ్యాచ్‌ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుస్తీ పట్టాల్సిన రెజ్లర్లు నాటు నాటు అంటూ స్టెప్పులు !! సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

ట్రెడ్‌మిల్‌పై కుప్పకూలిన యువకుడు !! చివరికి ??

నేను బతికే అవకాశం లేదు.. పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో.. జవాన్‌ ఆవేదన