Viral Video: ఎలుగుబంట్లుగా మారుతున్న రైతులు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

|

Jun 29, 2023 | 9:51 AM

విత్తు వేసింది మొదలు పంట చేతికి వచ్చేదాకా రైతులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు రకరకాల పద్ధతులు పాటిస్తారు. కొందరు పొలంలో దిష్టిబొమ్మలు పెడతారు. లేదా ఏదైనా ఉపకరణాలను ఏర్పాటు చేస్తారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని..

విత్తు వేసింది మొదలు పంట చేతికి వచ్చేదాకా రైతులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు రకరకాల పద్ధతులు పాటిస్తారు. కొందరు పొలంలో దిష్టిబొమ్మలు పెడతారు. లేదా ఏదైనా ఉపకరణాలను ఏర్పాటు చేస్తారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రైతులు తమ పంటను కాపాడుకోడానికి ఎలుగుబంట్లుగా మారుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. లఖింపుర్‌ ఖేరి ప్రాంత రైతులు తమ చెరకు పంటను కోతుల బారి నుంచి రక్షించుకునేందుకు ఎలుగుబంటి అవతారం ఎత్తుతున్నారు. కోతులు తమ పంటలను నాశనం చేస్తున్నాయని, వాటిబారినుంచి తమ పంటలను కాపాడాలని ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో రైతులు ఓ నిర్ణయానికి వచ్చారు. తమ పంటను కాపాడుకునేందుకు రైతుల కుటుంబాల్లో రోజుకొకరు ఎలుగుబంటి వేషధారణలో పొలాల వద్ద చక్కర్లు కొడుతూ పంటకు కాపలా కాస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్థరాత్రి ఓ జంటను దోచుకోబోయిన దుండగులు.. చివరికి ??

డ్యూటీ టైం అయిపోయిందని విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలట్స్

Pawan Kalyan: జ్వరంలోనే.. తగ్గని స్వరం దటీజ్ పవన్

Adipurush: ఇక ఓటీటీలో ఆదిపురుష్‌.. సందడి షురూ..

Rakesh Master: కన్నీళ్లు పెట్టిస్తున్న రాకేష్ మాస్టర్ చివరి వీడియో..