రోజుకి రూ. 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
మహారాష్ట్ర రైతు రోషన్ కుడే లక్ష రూపాయల అప్పు కోసం రోజుకు రూ.10 వేల వడ్డీ కడుతూ, అది రూ.74 లక్షలకు చేరడంతో తన కిడ్నీని రూ.8 లక్షలకు కంబోడియాలో అమ్ముకున్నాడు. వడ్డీ వ్యాపారుల వేధింపులు, పోలీసుల నిర్లక్ష్యంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం జరగకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. ఇది అన్నదాతల దుస్థితికి నిదర్శనం.
పాల వ్యాపారం కోసం లక్ష రూపాయలు అప్పు చేసాడు ఓ రైతు రోజుకు రూ.10 వేల వడ్డీతో ఆ మొత్తం రూ.74 లక్షలకు చేరడంతో చేసేదేం లేక కంబోడియా వెళ్లి కిడ్నీ అమ్ముకున్నాడు. మహారాష్ట్రలో ఈ ఘటన అన్నదాత దుస్థితికి అద్దం పడుతోంది. వడ్డీ వ్యాపారులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని న్యాయం జరగకపోతే ఆత్మార్పణం చేసుకుంటానని రైతు హెచ్చరించాడు. చంద్రపూర్ జిల్లాకు చెందిన యువ రైతు రోషన్ సదాశివ్ కుడేకు సాగులో తీవ్ర నష్టాలు రావడంతో డెయిరీ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో రోజు వడ్డీకి స్థానిక వడ్డీ వ్యాపారుల దగ్గర మొత్తం లక్ష రూపాయాలు అప్పు తీసుకున్నాడు. అతడిని దురదృష్టం వెంటాడింది. డెయిరీ ప్రారంభం కాకముందే కొన్న ఆవులు చనిపోయాయి. పంటలు దెబ్బతిని అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. వడ్డీ వ్యాపారులు కుడేను, అతడి కుటుంబాన్ని వేధించడం ప్రారంభించారు. దీంతో వారి అప్పు తీర్చడానికి పొలం, ట్రాక్టర్, ఇంట్లో ఉండే విలువైన వస్తువులను అమ్మేశాడు. అయినా అవి కూడా సరిపోలేదు. ఇంకా, అప్పు మిగిలిపోవడంతో వడ్డీ వ్యాపారుల్లో ఒకరు కిడ్నీ అమ్ముకోమని కుడెకు సలహా ఇచ్చాడు. ఓ ఏజెంట్ ద్వారా కోల్‌కతాకు వెళ్లిన రోషన్ సదాశివ్ అక్కడ పరీక్షలు పూర్తయిన తర్వాత కాంబోడియా వెళ్లాడు. అక్కడ ఆపరేషన్ చేయించుకుని కిడ్నీని రూ.8 లక్షలకు అమ్ముకున్నాడు. ఆ డబ్బు తెచ్చి అప్పు తీర్చాడు. లక్ష రూపాయాలు తీసుకుంటే.. రోజుకు రూ.10 వేలు వడ్డీ వేసి రూ.74 లక్షలు వసూలు చేశారని యువరైతు కన్నీటిపర్యంతమయ్యాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తను శారీరకంగా, మానసికంగా ఎంతో వేదనకు గురయ్యాయని వాపోయాడు. తమకు న్యాయం జరగకుంటే కుటుంబంతో కలిసి ముంబయిలోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయం మంత్రాలయం వద్ద ఆత్మార్పణం చేసుకుంటామని హెచ్చరించాడు. ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఇది చాలా విచారకరమని అన్నారు. ‘‘ఒక రైతు వడ్డీ వ్యాపారి నుంచి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడానికి తన కిడ్నీని అమ్ముకోవాల్సి వస్తే, అది ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరం. సంబంధిత వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రొమ్ములను తీయించుకున్న ఏంజెలినా జోలీ
అది కుక్క కాదు.. నా కూతురు ! డిపెండెంట్ హోదా ఇవ్వాలని కోర్టుకెక్కిన మహిళ
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి
Demon Pavan: మారుతున్న బిగ్‌బాస్ ఓటింగ్ ట్రెండ్ దూసుకొస్తున్న డీమాన్
Bandla Ganesh: ఓజీ డైరెక్టర్‌కు కాస్ల్టీ గిఫ్ట్ ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్