Farmer Idea for Crop Video: వాట్ ఎన్ ఐడియా రైత్‌జీ.. ఏం చేశాడో చూడండి..! వీడియో వైరల్..
పంటపొలాలను జంతువులు, పక్షుల నుంచి రక్షించడానికి రైతులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కోతకు వస్తున్న పంట పొలాలను కోతులు కూడా నాశనం చేస్తున్నాయి. దీంతో ఆరుగాలం కష్టించి పండించిన పంట నాశనం కావడం చూసి రైతుల ఎన్నో బాధలు పడాల్సి వస్తోంది.
పంటపొలాలను జంతువులు, పక్షుల నుంచి రక్షించడానికి రైతులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కోతకు వస్తున్న పంట పొలాలను కోతులు కూడా నాశనం చేస్తున్నాయి. దీంతో ఆరుగాలం కష్టించి పండించిన పంట నాశనం కావడం చూసి రైతుల ఎన్నో బాధలు పడాల్సి వస్తోంది. కోతులతో పాటు పక్షులు, ఇతర జంతువులు పంటలను నాశనం చేసేస్తుంటాయి. 24 గంటలు పంటల వద్ద రైతులు ఉండలేరు కాబట్టి.. వాటి నుంచి పంటను రక్షించుకునేందుకు ఏదో ఒక ఏర్పాటు చేస్తుంటారు. పక్షులను భయపెట్టేందుకు అక్కడ దిష్టిబొమ్మలను ఏర్పాటు చేయడం, ఎర్రటి రంగు చీరలను కట్టడం చేస్తుంటారు. వాటిని చూసి పక్షులు, జంతువులు బెదిరిపోతాయని రైతుల నమ్మకం.
తాజాగా ఓ రైతు పక్షుల బెడద నుంచి తప్పించుకునేందుకు మంచి ఉపాయం ఆలోచించి.. దాన్ని పంటపొలాల్లో ఏర్పాటు చేశాడు. ఫ్యాన్‌ను ఏర్పాటు చేసి దానికి చైన్‌ను కట్టి.. పక్కనే ఓ స్టీల్ బాక్స్‌ను పెట్టాడు. ఫ్యాన్ తిరుగుతూ దానికి ఉన్న చైన్ కూడా అటూ ఇటూ ఊగుతూ స్టీల్ బాక్స్ మీద పడి టప్.. టప్ అనే సౌండ్ అవుతుంది. ఆ సౌండ్‌కు పక్షులు ఉండకుండా పారిపోతాయని ఆ రైతు చేసిన ఉపాయం వర్కవుట్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వావ్.. ఆ రైతు ఉపాయం బాగుంది అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
Car in Flood Video: వరదలో కొట్టుకుపోతున్న కారును తాడుతో పక్కకు లాగిన వైనం.. వైరల్ అవుతున్న వీడియో..