CISF Dogs: సీఐఎస్ఎఫ్‌ డాగ్స్‌కి ఘ‌నంగా వీడ్కోలు.. అర్మీలో పదేళ్లు స‌ర్వీస్ అందించిన స్పార్కీ , ఇవాన్..

Updated on: Nov 07, 2022 | 9:43 AM

దేశ సేవకై ఏళ్లతరబడి తమ జీవితాలను ఫణంగా పెట్టి ఆర్మీలో సేవలు చేసి రిటైర్‌ అయినవారికి గౌరవ మర్యాదలతో వీడ్కోలు పలుకుతారు. సైనికులతో పాటు దేశరక్షణలో పాలుపంచుకునే ఆర్మీ డాగ్స్‌కి కూడా అధికార లాంఛ‌నాల‌తో రిటైర్‌మెంట్ వేడుక నిర్వహిస్తారు.


సిఐఎస్ఎఫ్ డాగ్ స్క్వాడ్ టీంలో లాబ్రడార్ జాతికి చెందిన స్పార్కీ అనే ఆడ‌కుక్క, కాక‌ర్ స్పానియెల్ జాతికి చెందిన ఇవాన్ అనే మ‌గ‌కుక్క ప‌దేళ్లు సేవ చేసాయి. 2022 అక్టోబరుతో వాటి స‌ర్వీస్ ముగియ‌డంతో రిటైర్‌మెంట్ వేడుక నిర్వహించారు. వాటి మెడ‌లో పూల‌దండ‌లు వేసి, వాటి స‌ర్వీస్‌కి గుర్తింపుగా మెడ‌ల్స్ ఇచ్చారు. ఆ త‌ర్వాత వాటిని ఎస్‌యూవీ వాహ‌నంలో ఎక్కించి, సీఎస్ఎఫ్ సిబ్బంది దాన్ని తాడుతో లాగారు. ఈ వీడియోని ఎఎన్ఐ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. దాంతో ఈ వీడియో నెట్టింట బాగా వైరల్‌ అయింది. దాదాపు లక్షమంది ఈ వీడియోను వీక్షించారు. వేలమంది లైక్‌ చేశారు. ఈ రెండు డాగ్స్ స్థానంలో లాబ్రడార్ జాతికి చెందిన జూలీ, రూబీల‌ను త‌మ డాగ్ స్క్వాడ్ టీంలోకి తీసుకోనుంది సీఐఎస్ఎఫ్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..

Brother – sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Published on: Nov 07, 2022 09:43 AM