శ్రీరాముని ఫోటోతో కొత్త రూ. 500 నోటు అంటూ ప్రచారం !! నిజమేంటంటే ??

|

Jan 19, 2024 | 11:34 AM

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ సమయంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో 500 రూపాయల నోటుకు సంబంధించిన అంశం ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‎గా మారింది. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా 500 నోట్లపై గాంధీ బొమ్మకు బదులు శ్రీరాముని చిత్రాన్ని ముద్రిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవైపు శ్రీరాముని చిత్రపటాన్ని అచ్చు వేయగా..

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ సమయంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో 500 రూపాయల నోటుకు సంబంధించిన అంశం ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‎గా మారింది. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా 500 నోట్లపై గాంధీ బొమ్మకు బదులు శ్రీరాముని చిత్రాన్ని ముద్రిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవైపు శ్రీరాముని చిత్రపటాన్ని అచ్చు వేయగా.. నోటుకు మరొక భాగంలోని ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ నమూనాను ముద్రించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్వచ్ఛ భారత్ అని గాంధీజీ కళ్ల జోడు ఉండే స్థానంలో శ్రీరాముని బాణం, విల్లు ఉండేలా రూపొందించారంటూ.. దీనికి సంబంధించిన ఫోటో వైరల్‌గా మారింది. ఈ నోటును జనవరి 22న రామమందిర ప్రతిష్ఠాపన రోజు జారీ చేయనున్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈమధ్య కాలంలో సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్క అంశాన్ని వక్రీకరిస్తూ వైరల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. అలాగే ఈ 500 రూపాయల నోటు విషయం కూడా ఫేక్‌ అని తెలుస్తోంది. గతంలోనే కొత్తగా ముద్రించిన ఈ 500 రూపాయల నోటును ఇప్పట్లో రద్దు చేసే అవకాశం లేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Raja Saab: రాజాసాబ్ స్టోరీ లీక్‌.. కథ చూసి హమ్మయ్య అనుకున్న రెబల్ ఫ్యాన్స్‌

శృతి హాసన్‌ షాకింగ్ కొశ్చన్‌.. కూల్‌గా ఆన్సర్ ఇచ్చిన డార్లింగ్

Katrina Kaif: కత్రినా నోట బాలయ్య మాట.. వింటే అందరూ షాకవ్వాల్సిందే

Guntur Kaaram: యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతున్న ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్

Guntur Kaaram: 200 కోట్ల దిశగా గుంటూరోడు.. ఇక బాక్సాఫీస్‌ బేజారే

Published on: Jan 19, 2024 11:32 AM