ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ బాలుడు చెప్పిన షాకింగ్ నిజాలు వీడియో

Updated on: Nov 03, 2025 | 3:10 PM

చేవెళ్ల బస్సు ప్రమాదంపై ప్రాణాలతో బయటపడిన బాలుడు కీలక వివరాలు వెల్లడించాడు. తన చెవి నొప్పి చికిత్స కోసం తండ్రితో కలిసి తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో వంద మందికి పైగా ఉన్నారని, మంటల్లో చిక్కుకుపోయి అంతా కేకలు వేశారని తెలిపాడు. ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన బాలుడు అంతర్గత గాయాలతో బయటపడ్డాడు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన బాలుడు ఆనాటి భయానక క్షణాలను వివరించాడు. ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోంది. తాండూరు, వికారాబాద్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ బృందాలు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నాయి. ఈ ప్రమాదంలో తన తండ్రి హనుమంతును కోల్పోయిన బాలుడు తన అనుభవాన్ని పంచుకున్నాడు. తాండూరు నుండి హైదరాబాద్‌లోని ఈఎన్‌టీ హాస్పిటల్, కోటికి చెవి నొప్పి చికిత్స కోసం వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రైలు మిస్ అవ్వడంతో బస్సు ఎక్కినట్లు తెలిపాడు. ఉదయం 4:30 గంటలకు బయలుదేరి, సుమారు 6:30 గంటలకు బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని వెల్లడించాడు.

మరిన్ని వీడియోల కోసం :

తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి..గదిలో సీన్‌ చూసి షాక్‌ వీడియో

మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో

రూ.11 కోట్ల జాక్‌పాట్‌ కొట్టాడు..కానీ వీడియో