వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో నలుగురి ప్రాణం తీసిన అనుమానం వీడియో
వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో భార్యపై అనుమానంతో యాదయ్య అనే వ్యక్తి భార్య, చిన్న కూతురు, వదిన హనుమమ్మను కొడవలితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కూతురు అపర్ణ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భార్యాభర్తల మధ్య గొడవలే ఈ ఘటనకు కారణమని పోలీసులు గుర్తించారు.
వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్లలో జరిగిన దారుణ ఘటనలో భార్యపై అనుమానంతో యాదయ్య అనే వ్యక్తి తన కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. యాదయ్య తన భార్యతో పాటు చిన్న కూతురిని, వదిన హనుమమ్మను కొడవలితో గొంతు కోసి చంపేశాడు. పెద్ద కుమార్తె అపర్ణను కూడా చంపేందుకు ప్రయత్నించగా, ఆమె తృటిలో తప్పించుకుంది. ఈ దాడిలో అపర్ణ తలకు, చేతులకు తీవ్ర గాయాలవడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ముగ్గురిని హత్య చేసిన తర్వాత యాదయ్య ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులో భార్యపై అనుమానమే ఈ ఘోరానికి కారణమని గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం :
తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి..గదిలో సీన్ చూసి షాక్ వీడియో
మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో
రూ.11 కోట్ల జాక్‌పాట్ కొట్టాడు..కానీ వీడియో
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
