Lemon grove: నిమ్మతోటలో పైపులైను కోసం కూలీల తవ్వకాలు.. మట్టి తీస్తుండగా.. వైరల్ వీడియో.
తూర్పుగోదావరి జిల్లా… రాజానగరం మండలం శ్రీకృష్ణ పట్నం గ్రామం శివారులో శ్రీరాంపూరలో అరుదైన ఘటన వెలుగుచూసింది. పురాతనమైన అమ్మవారి విగ్రహం బయటపడింది.
తూర్పుగోదావరి జిల్లా… రాజానగరం మండలం శ్రీకృష్ణ పట్నం గ్రామం శివారులో శ్రీరాంపూరలో అరుదైన ఘటన వెలుగుచూసింది. పురాతనమైన అమ్మవారి విగ్రహం బయటపడింది. ప్రధాన రహదారికి చేరుకుని ఉన్న నిమ్మతోటలో పైపు లైను కోసం కూలీలు తవ్వకాలు చేస్తుండగా పురాతన అమ్మవారి విగ్రహం కనిపించింది. అంతా మట్టి ఉండటంతో.. తొలుత అది ఏం విగ్రహమో అర్థం కాలేదు. నీటితో శుభ్రం చేయగా కాళికామాత అవతారం గుర్తించారు. అమ్మవారి విగ్రహాన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. గ్రామస్థులు భక్తిశ్రద్దలతో ఆ విగ్రహానికి జలాలతో అభిషేకం చేసి.. పూజలు చేశారు. మహిళలు పసుపు, కుంకుమ పూలు సమర్పించారు. ఈ విగ్రహం అతి పురాతనమైనదిగా అనిపిస్తుందని.. ప్రతిష్టాపనతో పాటు గుడి ఏర్పాటుపై గ్రామస్తులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని గ్రామ పెద్దలు వెల్లడించారు. ఈ అమ్మవారి విగ్రహం పురాతన శిల్పకళ ఎంత గొప్పదో తెలియజేస్తుందని పురోహితులు అంటున్నారు. ఇలా నిర్మాణాల కోసం తవ్వకాలు జరితున్నప్పుడు.. పూర్వికులు దాచిన నిధి, నిక్షేపాలు.. ఆయా కాలాల నాటి వస్తువులు బయటపడటం చూశాం. కానీ ఇలా దేవతల విగ్రహాలు బయల్పడటం చాలా రేర్ అని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

