AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teacher: బట్టబయలు అయినా రిటైర్డ్ ఉపాధ్యాయుడి రాసలీలలు.. 30 ఏళ్ల సర్వీసులో 60 మంది విద్యార్థినులపై..

Teacher: బట్టబయలు అయినా రిటైర్డ్ ఉపాధ్యాయుడి రాసలీలలు.. 30 ఏళ్ల సర్వీసులో 60 మంది విద్యార్థినులపై..

Anil kumar poka
|

Updated on: May 21, 2022 | 8:48 AM

Share

అతనొక విద్యా బుద్ధులు నేర్పే గురువు.. కానీ తప్పటడుగులు వేశాడు.. నిత్యం కామంతో రగిలిపోతూ.. విద్యార్థులను లైంగికంగా వేధించేవాడు. ఇలా కీచక ఉపాధ్యాయుడు తన 30 ఏళ్ల సర్వీసులో 60 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.


అతనొక విద్యా బుద్ధులు నేర్పే గురువు.. కానీ తప్పటడుగులు వేశాడు.. నిత్యం కామంతో రగిలిపోతూ.. విద్యార్థులను లైంగికంగా వేధించేవాడు. ఇలా కీచక ఉపాధ్యాయుడు తన 30 ఏళ్ల సర్వీసులో 60 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కేరళలోని కామంతో కళ్లు మూసుకుపోయిన మాజీ ఉపాధ్యాయుడి ఘోరాలు ఒక్కొక్కటిగా అలస్యంగా వెలుగులోకి వచ్చాయి.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. 30 ఏళ్ల సర్వీసులో ఆ కీచకుడు ఏకంగా 60 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతోపాటు ఈ ఘటనపై విచారణ చేపట్టాలని కేరళ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన మలప్పురం మున్సిపాలిటీలో జరిగింది. సీపీఎం కౌన్సిలర్‌గా ఉన్న కేవీ శశికుమార్.. పట్టణంలోని సేంట్ గెమాస్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేసి 2022 మార్చిలో రిటైర్ అయ్యాడు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన సమయంలో వేధింపులకు గురి చేసినట్టు శశికుమార్‌కు వ్యతిరేకంగా పోలీసు కేసు నమోదైంది. అయితే.. దాదాపు 50 మందికి పైగా కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు పర్యాయాలు కౌన్సిలర్‌గా పనిచేస్తుండడంతో రాజకీయ పలుకుబడిని అతడు తనకు రక్షణగా ఉపయోగించుకున్నట్లు సమాచారం. అయితే.. ఇప్పటివరకు దుర్మార్గుడి అఘాయిత్యాలపై ఎవరూ ధైర్యం చేసి చెప్పలేకపోయారు. ఈ క్రమంలో శశికుమార్ రిటైర్ అయ్యాడని ఫేస్ బుక్ ద్వారా తెలుసుకున్న ఓ మాజీ విద్యార్థిని ఒకరు అతడి లీలలను బయటపెట్టింది. మీటూ (MeToo) ఆరోపణలు చేస్తూ పలు వ్యాఖ్యలు చేయగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణలు రావడంతో.. వారం రోజులుగా పరారీలో ఉన్న శశికుమార్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి విచారణకు ఆదేశించారు. ఈ పరిణామాలతో శివకుమార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు సీపీఎం ప్రకటించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!

Published on: May 21, 2022 08:48 AM