ఏనుగమ్మా ఏనుగు.. మా ఊరు రావద్దు ఏనుగు

|

Jun 04, 2024 | 11:13 PM

తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి గ్రామానికి ఆనుకొని ఉన్న మామిడి తోటల్లో చొరబడ్డ ఏనుగుల గుంపు మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. దాదాపు 60 ఎకరాల్లో మామిడి చెట్లను చీల్చి చెండాడాయి. తోటలోనే తిష్ట వేసిన ఏనుగులను తరిమికొట్టేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏనుగుల మందను చెల్లాచెదురు చేసేందుకు స్థానిక రైతులు బాణసంచా పేల్చారు.

తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి గ్రామానికి ఆనుకొని ఉన్న మామిడి తోటల్లో చొరబడ్డ ఏనుగుల గుంపు మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. దాదాపు 60 ఎకరాల్లో మామిడి చెట్లను చీల్చి చెండాడాయి. తోటలోనే తిష్ట వేసిన ఏనుగులను తరిమికొట్టేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏనుగుల మందను చెల్లాచెదురు చేసేందుకు స్థానిక రైతులు బాణసంచా పేల్చారు. అయినా లాభం లేదు. మామిడి పళ్ల సీజన్‌ లో ఇలా ఏనుగులు మామిడిచెట్లను ధ్వంసం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాత్రి అయితే చాలు మామిడితోటల్లోకి ఏనుగులు చొరబడి బీభత్సం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోకి జంతువులు రాకుండా గతంలో అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన ట్రెంచ్ అకాల వర్షాలకు పూడుకుపోయిందని, దాంతో జంతువులు గ్రామాల్లోకి కూడా చొరబడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఏనుగులకు తరిమివేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంతంటే ??

తాటి చెట్ల మధ్య ఇరుక్కున్న గేదె.. ఎలా బయటకి తీశారంటే ??

TOP 9 ET News: గుడ్‌ న్యూస్ !! కల్కి ట్రైలర్ డేట్ ఫిక్స్.. | డ్రగ్‌ పార్టీకి నిర్వహణలో హేమ కీ రోల్

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హాట్ హీరోయిన్

కార్తికేయ కోసం.. కోట్ల లగ్జరీ కారును లెక్కచేయని

Follow us on