Elephant: జీపు వెనుక చిన్న ఏనుగు పరుగులు.. ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..ఇలాకూడా చేస్తారా అని..Viral Video

|

May 08, 2021 | 4:04 PM

Elephant running: వన్యపాణుల్ని రక్షించడం అంత సులభం కాదు. అవి ప్రమాదంలో ఉన్నా.. వాటిని రక్షించడానికి ఎవరైనా మనుషులు వెళితే భయపడి మరో ప్రమాదాన్ని కొనితెచ్చుకోవచ్చు. లేదా రక్షించడానికి వెళ్ళిన వారిపై దాడి చేయొచ్చు.

Elephant: జీపు వెనుక చిన్న ఏనుగు పరుగులు.. ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..ఇలాకూడా చేస్తారా అని..Viral Video
Elephant Running
Follow us on

Elephant running: వన్యపాణుల్ని రక్షించడం అంత సులభం కాదు. అవి ప్రమాదంలో ఉన్నా.. వాటిని రక్షించడానికి ఎవరైనా మనుషులు వెళితే భయపడి మరో ప్రమాదాన్ని కొనితెచ్చుకోవచ్చు. లేదా రక్షించడానికి వెళ్ళిన వారిపై దాడి చేయొచ్చు. ఇక అదే చిన్న జంతువులైతే మరింత ఇబ్బంది. వాటిని రక్షించడానికి వెళితే పెద్ద జంతువులు వాటికి హాని చేస్తున్నామనుకుని మన భరతం పట్టేస్తాయి. అందుకే వన్యప్రాణి సంరక్షకులు చాలా జాగ్రత్తగా అటువంటి పనులు చేస్తుంటారు. జంతువును బట్టి దానిని రక్షించడానికి పన్నే వ్యూహం ఉంటుంది. అంటే పులిపిల్ల అపాయంలో ఉంటె ఒకరకంగా.. జింక పిల్ల ప్రమాదంలో ఉంటె మరోరకంగా ఇలా జంతువును బట్టి దానిని రక్షించే వ్యూహమూ మారుతుంది. మరి అదే గున్న ఏనుగు అయితే, దానిని ఎలా రక్షిస్తారు? ఇదిగో ఇక్కడ మీకు అలాంటి వైరల్ వీడియో ఒకటి చూపించబోతున్నాం. చూపించే ముందు ఆ వీడియో గురించి కొంత వివరంగా చెప్పాలి.

ముందే చెప్పాం కదా ఒక్కో జంతువుని రక్షించడానికి ఒక్కో పధ్ధతి ఉంటుందని.. ఇదిగో ఈ వీడియోలో ఓ జీపు వెనుక ఒక గున్న ఏనుగు పరుగు తీస్తోంది. పాపం ఏనుగు పిల్లను అలా పరుగులు తీయిస్తున్నారు.. అని అనుకోకండి.. ఆగండి పూర్తిగా చెప్పనీయండి.. ఆ ఏనుగు పిల్ల తన గుంపు నుంచి విడిపోయింది. ఇప్పుడు తన తల్లి దగ్గరకు..దాని గుంపు దగ్గరకూ చేర్చాలి.. అందుకు ఇలా చేస్తున్నారు.

అదేంటి జీపు వెనుక పరిగెత్తితే తన గుంపు దగ్గరకు వెళుతుందా? అనేగా మీ సందేహం అవును.. గున్న ఏనుగుకు ఓ లక్షణం ఉంటుంది. తనకన్నా పెద్ద వస్తువు వేగంగా తన ముందు కదిలితే, దాని వెనుక బడి పరిగెత్తుతూనే ఉంటుంది. అందుకే అవి తరచూ తమ మంద నుంచి వేరు పడిపోతూ ఉంటాయి. సరే, అది అలా పెడితే ఇప్పుడు మన వీడియోలో ఉన్న పిల్ల ఏనుగు తన మందను చేర్చడం కోసం ఇదిగో ఇలా జీపును వేగంగా పోనిస్తున్నారు. దాని వెనుక పరిగెత్తుతున్న ఆ గున్న ఏనుగును అలాగే తన గుంపు వైపు తీసుకువెళ్ళి వదిలేస్తారు. అదీ సంగతి. ఇక వీడియో చూసేయండి మరి..

ఈ వీడియో ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనిని చూసిన వారంతా చాలా బావుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. బోలెడు లైకులు..షేర్లూ చేస్తున్నారు.. కొన్ని కామెంట్స్ మీరూ చూడండి..