Electrician Love: అబ్భా ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది అంటే ఇదే మరి..! గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం ఎలక్ట్రీషియన్ వింత పని..!

|

May 19, 2022 | 9:00 AM

ప్రేమ కోసం ఎలాంటి పిచ్చి పనులు చేయటానికైన వెనుకాడరు ప్రేమికులు..కొన్ని కొన్ని సార్లు దాడులు, దారుణాలు, ప్రాణత్యాగాలకు కూడా పాల్పడుతుంటారు. అయితే, ఇక్కడో ప్రేమికుడు తన ప్రేయసి కోసం ఏకంగా ఊరు ఊరినే

YouTube video player
ప్రేమ కోసం ఎలాంటి పిచ్చి పనులు చేయటానికైన వెనుకాడరు ప్రేమికులు..కొన్ని కొన్ని సార్లు దాడులు, దారుణాలు, ప్రాణత్యాగాలకు కూడా పాల్పడుతుంటారు. అయితే, ఇక్కడో ప్రేమికుడు తన ప్రేయసి కోసం ఏకంగా ఊరు ఊరినే చీకట్లోకి నెట్టేశాడు..చేతిలో నైపుణ్యంతో ఊరందరికీ కరెంట్‌ లేకుండా చేశాడు…ఈ ఘటన బీహార్‌లో జరిగింది. పూర్నియా జిల్లాలోని గణేష్ పూర్ గ్రామంలో ప్రతి రోజూ సాయంత్రం రెండు మూడు గంటల పాటు కరెంటు పోతుంటుంది. అలా రోజుల తరబడి ఇదే తంతు కొనసాగుతుండేది..కానీ, చుట్టు పక్కల ఊర్లలో కరెంటు నిరంతరాయంగా ఉంటుంది..కేవలం తమ ఊళ్లోనే, అదికూడా నిర్దిష్ట సమయంలో కరెంటు ఎందుకు పోతోందో అక్కడి వారికి అర్థం కాలేదు..దీని వెనుక గల మతలబు ఏంటో తెలుసుకోవాలని గ్రామస్తులు ఆరా తీశారు..ఈ క్రమంలో ఎలక్ట్రీషియన్ మీద నిఘా వేశారు. అతనికి తెలియకుండా వెంబడించి అసలు గుట్టురట్టు చేశారు. ఆ ఎలక్ట్రీషియన్ తన ప్రేయసిని కలవడానికి రోజూ ఆ సమయంలో కరెంటు తీస్తున్నాడని, పగలు కలవడం కుదరక, సాయంత్రం చీకటి పడే సమయానికి కరెంటు తీసి ఆమెను కలుస్తున్నాడని గ్రహించారు. దీంతో ఓ రోజు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రేమజంటను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇన్ని రోజులుగా కరెంటు విషయంలో ఇబ్బంది పెట్టాడనే కోపంతో గ్రామస్తులు మొదట ఎలక్ట్రీషియన్‌ను చితకొట్టారు. శిక్షగా వీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత ఇరువురి ఇష్టంతో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఆ ప్రేమజంటకు పెళ్లి చేశారు. కానీ, ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఎలాంటి పోలీస్‌ కేసు నమోదు చేయలేదు. దీంతో వారి కథ సుఖాంతం అయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 19, 2022 09:00 AM