ఈజిప్టు మమ్మీల శాపం నిజమైందా

Updated on: Nov 09, 2025 | 3:35 PM

ఈజిప్ట్‌లో ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద, ఒకే నాగరికతను ప్రదర్శించే మ్యూజియం ప్రారంభమైంది. పిరమిడ్ ఆకారంలో నిర్మించిన ఈ మ్యూజియంలో కింగ్ టూటన్‌ఖామ‌న్ మమ్మీ, లక్షకు పైగా ప్రాచీన వస్తువులున్నాయి. లార్డ్ కార్నర్‌వాన్ టూట్ సమాధిని తెరిచినప్పుడు ప్రచారంలోకి వచ్చిన "మమ్మీ శాపం" కేవలం బ్యాక్టీరియా వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ అని పురావస్తు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ మ్యూజియం ఈజిప్ట్ పర్యాటక రంగానికి ఊతమిస్తుంది.

ఈజిప్టులో 3 వేల ఏళ్ల నాటి మ‌మ్మీలున్నాయి. ట్యుటన్‌ఖామ‌న్ స‌మాధిని మొదటిసారి తెరిచి ప్రపంచానికి ఈజిప్ట్‌ మమ్మీని పరిచయం చేసిన ఘనత 1922లో లార్డ్ కార్నర్‌వాన్ అనే బ్రిటిష్‌ వ్యక్తికి దక్కుతుంది. ఆయన కృషి వల్ల ప్రపంచానికి ఈజిప్ట్‌ మమ్మీల గురించి తెలిసింది. ట్యుటన్‌ఖామ‌న్ స‌మాధిని తెరిచిన‌ కొద్ది రోజుల్లోనే లార్డ్ కార్నర్‌వాన్ బ్ల‌డ్ పాయిజ‌నింగ్‌తో చ‌నిపోయారు. ఈజిప్టు రాజుల‌కు చెందిన స‌మాధుల‌ను తెరిచినా.. వారి మ‌మ్మీల‌ను వెలికి తీసినా శాపం తగులుతుందని ఆ కారణంగా ఆయన చనిపోయినట్లు వదంతులు వినిపించాయి. 3 వేల ఏళ్ల నాటి స‌మాధిలోకి లార్డ్‌ కార్నర్‌వాన్‌ ప్రవేశించగానే అందులో ఉండే బాక్టీరియా, హానికార‌క క్రిముల వల్ల బ్ల‌డ్ పాయిజ‌న్ అయి ప్రాణాలు కోల్పోయారని పురాతత్వ శాస్త్రవేత్తలు అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు. ఈ విశేషాలను మనం ఇప్పుడు చెప్పుకోవడానికి కారణం తాజాగా ఈజిప్ట్‌లో అతిపెద్ద మ్యూజియం ప్రారంభం కావడమే. కేవలం ఒక్క దేశ నాగరికతను చూపే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా ఇది రికార్డ్‌లకెక్కింది. పిరమిడ్‌ ఆకృతిలో 2,50,00 చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు రూ.8,800 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మ్యూజియం కట్టారు. మలేరియా, ఎముక వ్యాధితో వేల ఏళ్ల క్రితం కన్నుమూసిన, శాపాలకు ప్రసిద్ధి చెందిన ఈజిప్ట్‌ యువరాజు ట్యుటన్‌ఖామ‌న్ మమ్మీ సహా ఎన్నో వస్తువులు ఈ మ్యూజియంలో ఉన్నాయి. ది గ్రేట్‌ గిజా పిరమిడ్‌కు అత్యంత సమీపంలో దీనిని కట్టారు. గాజు పలకలతో పిరమిడ్‌ ఆకృతిలో నిర్మించారు. ఈజిప్ట్‌ నాగరికతను తెలిపేలా వేల సంవత్సరాల నాటి లక్షకు పైగా పురాతన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. ఈజిప్ట్‌ను పరిపాలించిన 30 రాజవంశాలకు సంబంధించిన ప్రాచీన వస్తు సంపదను సందర్శకులు ఈ మ్యూజియంలో చూడొచ్చు. దేశ పర్యాటక రంగానికి పునర్‌ వైభవం తేవడంతో పాటు ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందనే ఉద్దేశంతో ఈ మ్యూజియంను నిర్మించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చీమల భయంతో ప్రాణాలు తీసుకున్న మహిళ

అదృష్టం అంటే ఇదే.. లక్కీ డ్రాలో పావుకేజీ బంగారం

దమ్ముంటే రా పట్టుకో.. కుక్కకు పక్షి సవాల్‌

ఒక్క నెలలోనే ఏకంగా 39,000 కేజీల బంగారం కొనుగోలు

ఢిల్లీకి సాయం చేస్తామన్న చైనా.. మన రిప్లయ్ పై ఉత్కంఠ