Duck Viral Video: వామ్మో ఇది బాతుకాదురా బాబోయ్‌.. చెర్రీ పూల చెరువులో ఏం చేస్తుందో చూడండి..

Updated on: Jul 04, 2022 | 8:12 AM

ప్రతిరోజూ మనం సోషల్‌ మీడియాలో ఎన్నో వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. వాటిలో కొన్ని వీడియోలు మనసుకు ఎంతో ప్రశాంతతను ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. తాజాగా


ప్రతిరోజూ మనం సోషల్‌ మీడియాలో ఎన్నో వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. వాటిలో కొన్ని వీడియోలు మనసుకు ఎంతో ప్రశాంతతను ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంతో రిలాక్స్‌ అవుతున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ బాతు అందమైన చెర్రీ పూల రేకులతో నిండిన చెరువులో ఈత కొడుతోంది. అది ఎటుపడితే అటు ఇష్టం వచ్చినట్లు ఈత కొట్టడం లేదు. ట్రైన్డ్‌ బాతులాగా సరళ రేఖలో స్విమ్మింగ్‌ చేస్తూ వెళుతోంది. అది చూస్తుంటే ఆకాశంలో రాకెట్‌ దూసుకెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈ వీడియోను ‘యోద ఫ‌ర్ ఎవ‌ర్’ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఈ బాతు స్విమ్మింగ్‌ చూసి నెటిజన్లు ఎంతో ఆహ్లాదాన్ని పొందుతున్నారు. దాదాపు 50 వేలమంది ఈ వీడియోను లైక్‌ చేశారు. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. తాము కూడా ఈ బాతులాగే వీకెండ్‌లో రిలాక్స్‌గా ఉండాలనిపిస్తోంది అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?