Drunken man : నిషాలో ఫైథాన్‌తో పరాచకం.. మరెట్లుంటది రియాక్షన్.! వైరల్ వీడియో..
బాగా మద్యం తాగి.. మత్తులో రోడ్లపై నానా యాగీ చేసేవాళ్లను చూశాం. కాని ఓ వ్యక్తి పీకల దాకా మద్యం తాగి నిషాలో ఏం చేస్తున్నాడో ఒళ్లే మరిచిపోయాడు. ఓ వృద్ధుడు ఫూటుగా మద్యం తాగి..
బాగా మద్యం తాగి.. మత్తులో రోడ్లపై నానా యాగీ చేసేవాళ్లను చూశాం. కాని ఓ వ్యక్తి పీకల దాకా మద్యం తాగి నిషాలో ఏం చేస్తున్నాడో ఒళ్లే మరిచిపోయాడు. ఓ వృద్ధుడు ఫూటుగా మద్యం తాగి.. ఆ మత్తులో చేపలకు బదులు కొండచిలువతో పరాచికాలాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. చివరకు గంటల తరబడి శ్రమించిన గ్రామస్థులు ఆ వృద్ధుడి ప్రాణాలను రక్షించారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. గర్వా జిల్లాలోని పరిహారా పంచాయితీ పరిధిలోని కితాసోటి ఖుర్ద్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల బిర్జలాల్ రామ్ భుయాన్ అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లాడు. మద్యం మత్తుతో కొండచిలువను పట్టుకున్నాడు. తన చుట్టూ ఉన్న ప్రజలకు వినోదం పేరుతో గారడీ చేయడం మొదలుపెట్టాడు. ఈ సమయంలో అందరు చూస్తుండగానే కొండచిలువ బిర్జాలాల్ రామ్ భుయాన్ మెడను చుట్టుకుంది. వృద్ధుడికి ఊపిరి ఆడకుండా చేసింది. ఇది గమనించిన గ్రామస్థులు వెంటనే అప్రమత్తమై.. గంటల తరబడి శ్రమించి ఫైథాన్ బారి నుండి బీర్జలాల్‌ను రక్షించారు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

