నడి రోడ్డుపై పోలీస్ చేసిన పనికి అంతా షాక్ వీడియో

Updated on: Apr 24, 2025 | 12:05 PM

మందు కొట్టి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయని డ్రంక్ అండ్ డ్రైవ్ నిరోధించి మందుబాబులను అరెస్ట్ చేస్తారు. పైగా వారికి క్లాసులు ఇచ్చి తర్వాత వదిలిపెడతారు. మరి అలాంటి పోలీసులే మందు కొట్టి చిందులేస్తే ఓసారి ఊహించుకోండి. ఇక్కడ ఒక పోలీసు అదే చేశాడు. కాకపోతే చిందులేయలేదు. నడవలేక ఇబ్బంది పడుతూ నడి రోడ్డు మీద తూలి పడ్డాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు వచ్చి అతన్ని పక్కకు తీసుకు వెళ్ళాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

యూపీలోని బీజనూర్ వీధుల్లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఒక పోలీస్ చేతిలో తుపాకి పట్టుకొని మద్యం మత్తులో రోడ్డుపై తూలుతూ పడుతూ వెళ్ళాడు. ఈ క్రమంలో బీజనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాజీ చెక్క వద్ద రద్దీగా ఉన్న రోడ్డు మీద పడిపోయాడు. పైకి లేచేందుకు ప్రయత్నించిన మద్యం మత్తులో ఉన్న అతను పైకి లేవలేకపోయాడు. అతను పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాడు. పైగా అతని వద్ద రైఫిల్ కూడా ఉంది. దీంతో పడిపోయిన అతని దగ్గరకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. అక్కడే వీధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు ఇది చూసి వెంటనే స్పందించాడు. మద్యం మత్తులో ఉన్న పోలీసును పైకి లేపి రోడ్డు పక్కకు తీసుకు వెళ్ళాడు. ఈ ఘటన తాలూకు వీడియో బయటకు రావడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో బీజనూర్ పోలీస్ డిపార్ట్ మెంట్ దీనిపై స్పందించింది. ఆ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ చర్యలు చేపట్టినట్లు ఎక్స్ ద్వారా వెల్లడించింది.

మరిన్ని వార్తల కోసం :

వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో

అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో

యువకుడి ఐడియా అదుర్స్.. ఏసీ కూడా పనికి రాదు వీడియో