Drishyam Murder: సంచిలో శవం.. కాంక్రీట్ ఫ్లోరింగ్ వేసి మాయం.. కేరళలో ‘దృశ్యం’ సీన్..!
కొట్టాయం జిల్లాకు చెందిన 40ఏళ్ల బిందు కుమార్ అలప్పుళలో అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అలప్పుళ నార్త్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఓ వ్యక్తి మిస్సింగ్ కేసులో పోలీసుల దర్యాప్తుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేరళలో జరిగిన ఈ ఘటన మరోసారి ‘దృశ్యం’ సినిమాను తలపించింది. నిందితులు.. హత్య చేసి, శవాన్ని ఇంట్లోనే గోనె సంచిలో ఉంచి గోతిలో పాతిపెట్టారు. అంతేకాదు, పైన కాంక్రీట్‌తో ఫ్లోరింగ్ చేశారని నిందితులు. కొట్టాయం జిల్లాకు చెందిన 40ఏళ్ల బిందు కుమార్ అలప్పుళలో అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అలప్పుళ నార్త్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతడి సెల్‌ఫోన్ కాల్ రికార్డులు పరిశీలించారు. చివరిసారిగా కొట్టాయం జిల్లా చంగనేస్సరికి చెందిన ముత్తు కుమార్‌తో బిందు కుమార్ ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు. ఈ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు.. ముత్తు కుమార్ కోసం ఆరా తీశారు. అయితే, ముత్తు కుమార్ ఇంటికి వెళ్లేసరికి అతడు కనిపించకుండాపోవడంతో.. చుట్టుపక్కల వాళ్లను ఆరా తీశారు.. కొద్దిరోజులుగా ముత్తు కుమార్ ఇంట్లో మరమ్మతులు జరుగుతున్నాయని స్థానికులు చెప్పారు. దీంతో పోలీసులు కొత్తగా వేసిన ఫ్లోరింగ్‌ను బద్దలుకొట్టించారు. ఆ తర్వాత 30 నిమిషాలు తవ్వాక వారికి శవం ఉన్న సంచి కనిపించింది. అది బిందు కుమార్‌దేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ విషయంపై స్పష్టత వచ్చేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న ముత్తు కుమార్ కోసం పోలీసలు గాలింపు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
