Pilot Crisis: ముదిరిన పైలెట్ల సంక్షోభం.. ఆ విమాన సర్వీసుల రద్దు.!
ఎయిరిండియాలో విస్తారా విలీనానికి ముందు జీతాల విధానాన్ని సవరించడాన్ని నిరసిస్తూ పైలెట్లు విధులకు డుమ్మా కొడుతున్నారు. దీంతో మంగళవారం నాటికి విమానయాన సంస్థ విస్తారాలో పైలెట్ల సంక్షోభం మరింత ముదిరింది. అనారోగ్య కారణాల సాకుతో పైలెట్లు విధులకు దూరంగా ఉంటున్నారు. పైలెట్లు అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఉదయం కీలక నగరాల నుంచి బయలుదేరాల్సిన 38 విస్తారా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ఎయిరిండియాలో విస్తారా విలీనానికి ముందు జీతాల విధానాన్ని సవరించడాన్ని నిరసిస్తూ పైలెట్లు విధులకు డుమ్మా కొడుతున్నారు. దీంతో మంగళవారం నాటికి విమానయాన సంస్థ విస్తారాలో పైలెట్ల సంక్షోభం మరింత ముదిరింది. అనారోగ్య కారణాల సాకుతో పైలెట్లు విధులకు దూరంగా ఉంటున్నారు. పైలెట్లు అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఉదయం కీలక నగరాల నుంచి బయలుదేరాల్సిన 38 విస్తారా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబై నుంచి వెళ్లాల్సిన 15 సర్వీసులు, ఢిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి బయలుదేరాల్సిన 11 సర్వీసులను రద్దు చేసినట్టు విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. సోమవారం కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. 50కిపైగా సర్వీసులు రద్దవ్వగా దాదాపు 160 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు వేర్వేరు కారణాలతో గత కొన్ని రోజులుగా గణనీయ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు చేశామని ప్రకటనలో విస్తారా పేర్కొంది. పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. విమాన సర్వీసులపై సత్వర స్పందన లేకపోవడం, ఎయిర్‌పోర్టుల్లో గంటల తరబడి నిరీక్షణపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎయిరిండియాలో విలీనానికి ముందు జీతాల విధానాన్ని సవరిస్తూ పైలెట్లకు విస్తారా ఎయిర్‌లైన్స్ మెయిల్స్ పంపించింది. ఈ నోటీసుపై సంతకం చేయాలని కోరింది. సంతకం చేయని పైలెట్లు విలీనం పరిధిలో ఉండబోరని హెచ్చరించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

