Dog Watching TV: టీవీ చూస్తున్న కుక్క.. ఒక్కసారిగా ఏం చేసిందో తెలుసా..? ఆశ్చర్యపోతున్న నెటిజన్లు వైరల్ వీడియో..
మీరు ‘ది లయన్ కింగ్’ సినిమా చూసి ఉంటారు. ఇది 2019 సంవత్సరంలో విడుదలైన ఒక ప్రసిద్ధ అమెరికన్ మ్యూజికల్ డ్రామా చిత్రం. ఈ సినిమా ఇండియాలో కూడా బాగా ఆడింది. సింబా అనే అడవి రాజు సింహం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో, సింబా...
మీరు ‘ది లయన్ కింగ్’ సినిమా చూసి ఉంటారు. ఇది 2019 సంవత్సరంలో విడుదలైన ఒక ప్రసిద్ధ అమెరికన్ మ్యూజికల్ డ్రామా చిత్రం. ఈ సినిమా ఇండియాలో కూడా బాగా ఆడింది. సింబా అనే అడవి రాజు సింహం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో, సింబా అడవికి రాజుగా మారడానికి చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. కానీ చివరికి సింబా రాజు అయ్యాడు. అడవిలో ఉన్న ఇతర జంతువులు కూడా అతనిని తమ రాజుగా భావిస్తాయి. రాజును గౌరవిస్తూ ప్రజలు ఎలా తల వంచుకుంటారో మీరు సినిమాల్లో చూసి ఉంటారు. ఈ చిత్రంలో సింబా గౌరవార్థం జంతువులు తల వంచుతాయి. ఈ సినిమా చూస్తున్న కుక్క కూడా తల వంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో కుక్క టీవీ చూస్తోంది, టీవీలో ‘ది లయన్ కింగ్’ సినిమా వస్తుంది. జీబ్రాస్ నుంచి ఏనుగులు, జిరాఫీలు సహా అన్ని జంతువులు రాజు గౌరవార్థం తల వంచుకునే సీన్ వస్తుంది. అప్పుడు టీవీలో ఈ దృశ్యం చూస్తున్న కుక్క కూడా తల వంచుకుని అడవి రాజుని గౌరవిస్తుంది. ఇది చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. కుక్క టీవీలో కూడా జంతువులను చూస్తూ ఎలా అనుకరిస్తున్న తీరుని చూసి నెటిజన్లు జంతువులు కూడా ఇలా చేస్తాయా..అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 11 సెకన్ల నిడివిగల ఈ వీడియోను లక్షలమంది వీక్షించడమే కాదు.. వేలల్లో లైక్స్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

