కడుపు నొప్పితో ఆస్పత్రికి.. స్కాన్ తీసిన వైద్యులు షాక్
చైనాలో హునాన్ ప్రావిన్స్ లో.. ఓ వ్యక్తి తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. ఏంటా అని స్కానింగ్ తీసిన వైద్యులు అతడి పొట్టలో ఉన్నది చూసి షాక్ తిన్నారు. స్కానింగ్ రిపోర్టులో అతని పొట్టలో అడుగు పొడవనున్న ఈల్ చేపను పోలిని జీవిని గుర్తించి.. వైద్యులు నోరెళ్లబెట్టారు. హునాన్ ప్రావిన్స్‌కు చెందిన 33ఏళ్ల వ్యక్తి ఒక్కసారిగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి పరిగెత్తాడు.
బాధతో విలవిలలాడుతున్న అతడికి డాక్టర్లు వెంటనే సీటీ స్కాన్ చేశారు. స్కాన్‌లో ఆ వ్యక్తి కడుపులో ఓ బతికున్న జీవి అటూ ఇటూ కదులుతుండటం చూసి డాక్టర్లు బిత్తరపోయారు. ఆ జీవి.. కడుపులో పేగులను కొరికి లోపలికి దూరేందుకు ప్రయత్నించటం చూసి.. వెంటనే లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ప్రారంభించారు. అప్పటికే.. ఆ జీవి అతడి పేగులోని కొంత భాగాన్ని చీల్చటంతో.. దానిని తొలగించి పేగును కుట్టేశారు. ఆ సర్జరీ విజయవంతం కావడంతో వ్యక్తి కొన్ని రోజుల చికిత్స తర్వాత కోలుకుని ఇంటికి వెళ్లాడు. అయితే ఈల్ అతడి శరీరంలోకి ఎలా చొచ్చుకుపోయింది? అన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారులో ఏసీ ఆన్ చేస్తే.. మైలేజీ తగ్గుతుందా?
మద్యం మత్తులో.. పామును కసా కసా కొరికి ..
రంగు మారిన టైల్స్.. ఏంటా అని చెక్ చేయగా షాక్
వామ్మో.. అద్దె ఇంటికి రూ. 23 లక్షలు అడ్వాన్స్
కూరగాయల వ్యాపారికి రూ.29 లక్షల GST నోటీసు.. కారణమేంటంటే..?