Black Fungus: మనిషి మెదడులో చిన్ సైజులో బ్లాక్‌ ఫంగస్‌... ఆపరేషన్‌ చేసి తొలగింపు.. ( వీడియో )
Black Fungus

Black Fungus: మనిషి మెదడులో చిన్ సైజులో బ్లాక్‌ ఫంగస్‌… ఆపరేషన్‌ చేసి తొలగింపు.. ( వీడియో )

|

Jun 14, 2021 | 8:58 AM

వ్యక్తి మెదడులో క్రికెట్‌ బంతి సైజులో బ్లాక్‌ ఫంగస్‌ను వెలికి తీశారు వైద్యులు. 60 ఏళ్ల పేషెంట్‌కు మూడు గంటల పాటు సర్జరీ నిర్వహించిన పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (IGIMS) వైద్యులు విజయవంతంగా తొలగించారు.

వ్యక్తి మెదడులో క్రికెట్‌ బంతి సైజులో బ్లాక్‌ ఫంగస్‌ను వెలికి తీశారు వైద్యులు. 60 ఏళ్ల పేషెంట్‌కు మూడు గంటల పాటు సర్జరీ నిర్వహించిన పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (IGIMS) వైద్యులు విజయవంతంగా తొలగించారు. అనిల్‌ కుమార్‌ అనే పేషెంట్‌ ఈ మధ్య కరోనా నుంచి కోలుకున్నాడు. అయితే తరచూ మైకంగా ఉండ‌టం, స్పృహ కోల్పోయినట్లు ఉండటం జరుగుతుండేది. దీంతో అత‌న్ని ఐజీఐఎంఎస్‌కు తరలించారు. అక్కడ పరిక్షలు జరిపిన వైద్యులు.. అతనికి బ్లాక్ ఫంగస్‌ సోకినట్లు గుర్తించారు. దీంతో వైద్యులు అతనికి సర్జరీ నిర్వహించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మనీష్‌ మండల్‌ మాట్లాడుతూ.. ఫంగ‌స్ అత‌ని ముక్కు ద్వారా మెద‌డులోకి చేరింద‌ని, అత‌ని కళ్లలోకి మాత్రం వెళ్లలేదని అన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Faf du Plessis: ఆసుపత్రిలో సౌతాఫ్రికా ప్లేయ‌ర్‌ చేరిన డుప్లెసిస్.. ఫీల్డింగ్‌లో తలకు గాయం.. ( వీడియో )

China: చైనా లో పేలిన గ్యాస్ పైప్ లైన్ 12 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు.. ( వీడియో )