Dayanidhi Maran: ఫోన్ కాల్ తో అకౌంట్ ఖాళీ.! కేంద్ర మాజీ మంత్రికి కుచ్చుటోపీ..!
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు.. గిఫ్ట్‌లు, కేవైసీలు, లాటరీల పేరుతో మాయమాటలు చెప్పి మోసాలు చేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు నయా ట్రెండ్ ఫాలో అవుతూ చీటింగ్‌లకు పాల్పడుతున్నారు. సైబర్ మోసానికి సంబంధించిన కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సైబర్ మోసానికి గురయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అతను తన OTPని ఎవరితోనూ పంచుకోలేదు. ఏ లింక్‌పై క్లిక్ చేయలేదు.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు.. గిఫ్ట్‌లు, కేవైసీలు, లాటరీల పేరుతో మాయమాటలు చెప్పి మోసాలు చేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు నయా ట్రెండ్ ఫాలో అవుతూ చీటింగ్‌లకు పాల్పడుతున్నారు. సైబర్ మోసానికి సంబంధించిన కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సైబర్ మోసానికి గురయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అతను తన OTPని ఎవరితోనూ పంచుకోలేదు. ఏ లింక్‌పై క్లిక్ చేయలేదు. అయినప్పటికీ అతను సైబర్ మోసానికి గురయ్యాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మారన్ ఖాతా నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని చెన్నై పోలీసులను ఆశ్రయించారు. మారన్ భార్యకు రెండు వేర్వేరు నంబర్ల నుండి కాల్ వచ్చింది. మూడో కాల్ డిస్‌కనెక్ట్ అయిన కొద్దిసేపటికే తమ సేవింగ్స్ ఖాతా నుంచి 99,999 రూపాయలు కట్ అయినట్లు మెసేజ్ వచ్చిందని ఎంపీ దయానిధి మారన్ తెలిపారు. ఈ మొత్తం ఒకే లావాదేవీలో డెబిట్ అయినట్లుగా వివరించారు. మొబైల్‌కు ఓటీపీ రాలేదని, జాయింట్ ఖాతాదారు అయిన తన భార్యకు సైబర్ దుండగులు ఫోన్ చేసి డబ్బులు కాజేశారన్నారు. బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేసి ఖాతాను స్తంభింపచేసినట్టు చెప్పారు. ఓటీపీ రాకుండా తన ఖాతా నుంచి సొమ్ము ఎలా బదిలీ అయ్యిందో యాక్సిస్ బ్యాంక్ అధికారులు సైతం చెప్పలేకపోతున్నారని తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..