పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పెళ్లి అనేది జన్మజన్మల బంధం అని చాలామంది నమ్ముతుంటారు. కానీ ఈ మధ్య కాలంలో పెళ్లయిన కొంత కాలానికే విడాకులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో వయసు పైబడినవారు.. అంటే 50 ఏళ్లు పైబడిన వారి లోనూ విడాకుల కేసులు రెట్టింపయ్యాయి. ఈ విధంగా మలి వయసులో విడాకులు తీసుకోవడాన్ని గ్రే డివోర్స్ అంటారు.
చాలా కాలం కలిసి జీవించిన తర్వాత వేరుగా ఉండాలని నిర్ణయించుకోవడం చాలా కష్టమే. కానీ ఈ మధ్య కాలంలో ఈ విధమైన విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల ఏఆర్ రెహమాన్ 57 ఏళ్ల వయసులో తన భార్య నుంచి విడాకులు తీసుకొని షాక్ ఇచ్చారు. ఈ విడాకుల స్టోరీ మనుషుల్లోనే కాదు.. పక్షుల్లో కూడా ఉందట. అయితే మనుషుల్లానే.. అనేక పక్షులు సైతం చాలాకాలం ఒకే సహచరితో జీవిస్తాయని, కొన్ని సందర్భాల్లో మనుషుల్లానే విడిపోతాయని అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. మాక్వారీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సీషెల్స్ ద్వీపాల్లో కనిపించే సీషెల్స్ వార్‌బ్లర్ అనే పక్షులపై అధ్యయనం జరిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ పక్షులు ఎక్కువగా విడిపోతున్నట్టు వీరు గుర్తించారు. ఈ పక్షులు 15 ఏళ్ల పాటు కలిసి ఉంటాయని, అయితే ఏటా 1 నుంచి 16 శాతం వరకు తమ బంధాన్ని తెంచుకుంటున్నాయని పరిశోధకులు తెలిపారు. సంతానోత్పత్తి సమయంలోను, వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పక్షులు ఎక్కువగా విడిపోతున్నట్టు గుర్తించామని చెప్పారు. కాబట్టి, వాతావరణ మార్పుల ప్రభావం పక్షుల సంతానోత్పత్తిపైనా పడుతోందని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.