Sales director: బట్టతల ఉందని ఊడిన ఉద్యోగం.. భలే షాకిచ్చిన కోర్టు..! వైరల్ వీడియో..
బట్టతలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు శతాబ్దాలుగా సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. అయితే బట్టతల ఉన్నవారు భాగ్యవంతులు అని ఓ సామెత ఉంది.
బట్టతలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు శతాబ్దాలుగా సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. అయితే బట్టతల ఉన్నవారు భాగ్యవంతులు అని ఓ సామెత ఉంది. అది ఎంతవరకూ నిజమో తెలియదు గానీ.. ఇంగ్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి విషయంలో మాత్రం అచ్చంగా సరిపోయింది. బట్టతల ఉందన్న కారణంతో ఆ వ్యక్తిని విధుల నుంచి తొలగించాడు అతడి బాస్. మరి ఆ వ్యక్తి తనకు జరిగిన అన్యాయానికి ముక్కుపిండి నష్టపరిహారం వసూలు చేశాడు..! ఇంగ్లాండ్‌కు చెందిన 61 ఏళ్ల మార్క్ జోన్స్.. లీడ్స్‌లోని టాంగో నెట్‌వర్క్ అనే మొబైల్ ఫోన్ల సంస్థలో సేల్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే బట్టతల ఉందన్న కారణంతో.. ఇటీవల జోన్స్ బాస్ ఫిలిప్ హెస్కెట్ అతడిని విధుల నుంచి తొలగించాడు. దీంతో జోన్స్ కోర్టును ఆశ్రయించారు. సదరు మొబైల్ తయారీ కంపెనీపై దావా వేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన స్థానిక న్యాయస్థానం.. జోన్స్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. టాంగో నెట్‌వర్క్.. వివక్షపూరితంగా విధుల నుంచి తొలగించిందని గుర్తించిన న్యాయస్థానం.. అతడికి 71వేల పౌండ్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 71లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆ కంపెనీని ఆదేశించింది. దీంతో ఆ మొత్తాన్ని కంపెనీ అతడికి చెల్లించింది. అయితే.. జోన్స్‌ను తొలగించిన ఆ బాస్ ఫిలిప్‌కు కూడా బట్టతల ఉండటం కొసమెరుపు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..