Different sounds in kitchen: వంటగది సింక్‌లో వింత శబ్ధాలు.. ఓపెన్ చేస్తే ఒకదాని వెంట మరొకటి..

|

Jul 13, 2022 | 9:19 AM

సాధారణంగా పాము పేరు చెబితేనే హడలిపోతారు చాలామంది. అలాంటిది ఊహించని విధంగా ఇంట్లో గుట్టలు గుట్టలుగా పాములు కనిపిస్తే పరిస్థితేంటి? ఒకసారి ఊహించండి...


సాధారణంగా పాము పేరు చెబితేనే హడలిపోతారు చాలామంది. అలాంటిది ఊహించని విధంగా ఇంట్లో గుట్టలు గుట్టలుగా పాములు కనిపిస్తే పరిస్థితేంటి? ఒకసారి ఊహించండి…తాజాగా అలాంటి సీనే ఎదురైంది ఓ ఇంట్లో వారికి.ఇండోర్‌లోని రౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేట్ రోడ్‌లో ఉన్న సత్య మిత్ర రాజలక్ష్మి అనే కాలనీ ఉంది. ఇక్కడ నివసించే నితిన్ పాటిల్ ఇంట్లోని కిచెన్‌ సింక్‌లోంచి పాములు వరుసగా బయటకు వచ్చాయి. ఒకదాని తర్వాత ఒకటిగా 7 రోజుల్లో దాదాపు 22 పాములు బయటకు వచ్చాయి. వాటిని చూసి హడలిపోయారు ఇంటివాసులు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఇల్లంతా సెర్చ్ చేయగా.. అక్కడక్కడ పాములు కనిపించాయి. వాటన్నింటినీ పట్టుకున్నారు అటవీ సిబ్బంది. కాగా, పాముల బెడదతో ఇంట్లోని వారు పొరుగింట్లో బస చేయాల్సి వచ్చింది. కాగా, ఇంట్లో పట్టుకున్న పాములను అటవీ అధికారులు ఫారెస్ట్ ఏరియాలో వదిలిపెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?