Valley Waterfall: పాలా.. నీళ్లా అనేలా భ్రమింపచేస్తున్న ప్రకృతి అందం.. నెటిజన్ల మనసుదోస్తున్న జలపాతం..

Updated on: Dec 05, 2022 | 8:46 AM

ప్రకృతిలో ఎన్నో అందాలు నిండి ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులు వీటిని చూసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. అందులో జలపాతాలు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆకాశంనుంచి జారి పడుతున్నాయా అన్నట్టుగా కనువిందు చేసే జలపాతాలంటే ఇష్టపడనివారుండరు.


దివి నుంచి భువికి జాలువారే నీటి అందాలను చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సాధారణంగా జలపాతాలన్నీ కూడా ప్రకృతి సిద్ధమైనవే. అయితే ఒక్కో జలపాతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వర్షా కాలంలో అవి మరింత కనువిందు చేస్తుంటాయి. జలసవ్వడులతో కొండల మధ్యనుంచి జాలువారుతూ ఆకర్షిస్తుంటాయి. అలాంటి జలపాతాల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని దిబంగ్‌ వ్యాలీ వాటర్‌ఫాల్స్‌ ఒకటి.ఈ జలపాతం ప్రస్తుతం ప్రకృతి ప్రేమికుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. పాలధారలా కొండపై నుంచి కిందకు జాలువారుతూ నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. పాలా..? నీళ్లా..? అని భ్రమపడేలా ఉన్న ఈ జలపాతానికి సంబంధించిన వీడియోను అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమ ఖాండ ట్విట్టర్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘దేఖో అప్‌నా దేశ్‌’ క్యాంపెయిన్‌లో భాగంగా ఆయన ఈ వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘వావ్‌.. బ్యూటిఫుల్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Published on: Dec 05, 2022 08:46 AM